News September 21, 2025
ఆరోగ్యశ్రీతో NIMSలో ఉచిత గుండె శస్త్రచికిత్సలు

NIMSలో సెప్టెంబర్ 15 నుంచి 19 వరకు 4వ పీడియాట్రిక్ కార్డియాక్ సర్జరీ శిబిరం విజయవంతంగా పూర్తైంది. డా.రమణ, డా.ఎం.అమరేశ్ రావు ఆధ్వర్యంలో 22 మంది చిన్నారులకు క్లిష్టమైన గుండె ఆపరేషన్లు చేశారు. ఇందులో రష్యా, యూకే, భారత్‌కు చెందిన వైద్య నిపుణులు కలిసి సేవలందించారు. 500 మందికిపైగా రోగులు వైద్యపరీక్షలు చేయించుకున్నారు. ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా చికిత్సలు అందించారు.
Similar News
News September 21, 2025
HYD: పేదలు నివసిస్తున్న ప్రాంతాలను తొలగించట్లేదు: కమిషనర్

మేడ్చల్ జిల్లా <<17784226>>గాజులరామారంలో<<>> ప్రభుత్వ భూముల ఆక్రమణలను మాత్రమే తొలగిస్తున్నామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఈరోజు స్పష్టం చేశారు. ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తున్న వారిలో రాజకీయ నేతలు, ఉన్నతాధికారులు ఉన్నారని, 40 ఎకరాల్లో పేదలు నివాసాలు ఏర్పాటు చేసుకున్నారన్నారు. అధికారులతో స్థానిక నేతలు కుమ్మక్కై పేదలకు స్థలాలు విక్రయించారని, పేదలు నివసిస్తున్న ప్రాంతాలను హైడ్రా తొలగించట్లేదని కమిషనర్ పేర్కొన్నారు.
News September 21, 2025
HYD: రైలు ప్రయాణికులకు GOOD NEWS

రైల్వే ప్రయాణికులకు సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వే అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. రిజర్వేషన్ టికెట్లు, ఆన్ రిజర్వేషన్ టికెట్లు, ఫుడ్ ఆర్డర్, ఫ్లాట్ ఫారం టికెట్, రైల్వే భద్రత సమాచారం సహా వివిధ సేవలను కలిపి ‘RailOne యాప్’ పేరిట ఒకే యాప్‌లో అందిస్తున్నారు. ఇప్పుడు అన్ని రైలు సంబంధిత సేవలను ఒకే యాప్ ద్వారా పొందవచ్చని అధికారులు తెలిపారు. SHARE IT
News September 21, 2025
HYD: ఉస్మానియా ఆసుపత్రి హెల్ప్ లైన్ నంబర్ ఇదే..!

హైదరాబాద్‌లోని ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో వైద్య సేవలు, ఎమర్జెన్సీ సేవలు తెలుసుకోవడానికి ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్‌ను ఏర్పాటు చేశామని డాక్టర్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి శస్త్రచికిత్సలు, వైద్యం కోసం వస్తున్న వారికి ఈ నంబర్ అందుబాటులో ఉంటుందని చెప్పారు. 7780288622 నంబర్‌కు కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని సమాచారం.