News October 7, 2024

ఆరోజే అందరూ కలిసి వచ్చి ఉంటే బాగుండేది: పవన్ కళ్యాణ్

image

‘విశాఖ స్టీల్ ప్లాంట్ దగ్గర సభ నిర్వహించి ఉద్యోగ, కార్మిక సంఘాలు ఒక తాటిపైకి వచ్చి అఖిల పక్షంతో కేంద్రం దగ్గరకు వెళ్దామంటే ఏ ఒక్కరూ స్పందించలేదు. ఆరోజు అందరూ కలిసి వచ్చి ఉండుంటే, ఈరోజు ఇంత ఆందోళన చెందాల్సిన అవసరం ఉండేదు కాదు’ అని dy.cm పవన్ కళ్యాణ్ అన్నారు. కార్మికుల ఆందోళనను కేంద్రం దృష్టికి తీసుకెళ్తానని సోమవారం మంగళగిరి క్యాంప్ ఆఫీసులో స్టీల్ ప్లాంట్ కార్మిక నాయకులతో జరిగిన సమావేశంలో అన్నారు.

Similar News

News October 7, 2024

యలమంచిలి మాజీ ఎమ్మెల్యే ఇంట్లో చోరీ

image

యలమంచిలి మాజీ MLA కన్నబాబు ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. రాంబిల్లిలోని ఆయన ఇంటి తలుపు గడియలు విరగ్గొట్టి లోపలకు ప్రవేశించారు. పూజగదిలో వెండి వస్తువులు పట్టుకుపోయారు. వీటి విలువ రూ.50వేల వరకు ఉంటుందని అంచనా. అలాగే ఓ గ్యాస్ ఏజెన్సీలో రూ.50వేల నగదు పోయినట్లు బాధితుడు పి.సంతచేరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చోరీలపై ఆదివారం ఫిర్యాదులు అందడంతో దర్యాప్తు చేస్తున్నామని CI సీహెచ్ నర్సింగరావు తెలిపారు.

News October 7, 2024

విశాఖ: డిప్యూటీ సీఎంతో ముగిసిన భేటీ

image

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో విశాఖ ఉక్కు పోరాట కమిటీ నాయకుల భేటీ ముగిసింది. దాదాపు రెండు గంటల పాటు చర్చలు జరిగాయి. ప్రధానంగా విశాఖ స్టీల్ ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేయమని కార్మికులు డిమాండ్ చేశారు. ఉక్కు కర్మాగారంలో జరుగుతున్న పరిణామాలను డ్రాఫ్ట్ రూపంలో కార్మిక సంఘాల నాయకుల పవన్ కళ్యాణ్‌కు అందజేశారు.

News October 6, 2024

విశాఖ: Pic oF The Day

image

విశాఖ కుర్రోడు నితీశ్ కుమార్ రెడ్డి ఇంటర్నేషనల్ క్రికెట్‌లో అరంగేట్రం చేశారు. ఐపీఎల్‌లో అదరగొట్టిన నితీశ్ బంగ్లాదేశ్‌తో జరుగుతున్న టీ-20 సీరిస్‌కు ఎంపికయ్యారు. ఆదివారం జరుగుతున్న తొలి మ్యాచ్‌‌తో అరంగేట్రం చేశారు. టీం సభ్యుల మధ్య టీం ఇండియా క్యాప్ అందుకున్నారు. అతనితో పాటు మయాంక్ యాదవ్‌కు కూడా ఇదే తొలి అంతర్జాతీయ మ్యాచ్ కావడంతో వీరిద్దరూ టీం ఇండియా క్యాప్‌లతో ఫొటోలు తీసుకున్నారు.