News August 23, 2024

ఆర్ఓఆర్ 2024తో రైతులకు ఎంతో ఉపయోగకరం: గుత్తా

image

ప్రస్తుత 2020 రెవెన్యూ చట్టం వల్ల కలిగే ఇబ్బందులను తొలగించి రైతులకు ఉపయోగకరమైన చట్టాన్ని తీసుకొచ్చేందుకుగాను ప్రభుత్వం నూతన ఆర్ఓఆర్ 2024 చట్టం తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నట్లు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం NLG కలెక్టరేట్లో “తెలంగాణ హక్కుల రికార్డు బిల్లు- 2024” ముసాయిదా పై ఏర్పాటు చేసిన సదస్సు, చర్చ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

Similar News

News September 29, 2024

చెన్నారం గేటు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

image

కొండమల్లేపల్లి మండలం చెన్నారం గ్రామపంచాయతీ శివారులో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళుతున్న కారు బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై వెళుతున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు బుగ్గ తండాకు చెందిన భీముడు (23), రమేష్(8)గా గుర్తించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News September 29, 2024

NLG: ఎటు చూసినా ధరల మోతే

image

నల్గొండ జిల్లాలో కూరగాయల ధరలు ముండిపోతున్నాయి. రైతు బజార్లు, వారపు సంత, కూరగాయల మార్కెట్ ఎక్కడ చూసినా ధరల మోత మోగుతుంది. ఏ కూరగాయ చూసినా పావు కేజీ రూ.40 నుంచి రూ.60 పలుకుతోంది. జిల్లాలో రైతులు కూరగాయల సాగు వైపు పెద్దగా దృష్టి సారించడం లేదు. దీంతో కూరగాయలను ఇతర జిల్లాల నుంచి ఇక్కడికి దిగుమతి చేసుకుంటున్నారు. పెరిగిన ధరలతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

News September 29, 2024

NLG: నల్గొండకు కావాలి హైడ్రా!

image

నల్గొండ జిల్లాలో పెద్ద ఎత్తున చెరువులు, కుంటలు ఆక్రమణలకు గురవుతున్నాయి. ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా ఏర్పాటు చేసినా అక్రమార్కుల్లో భయం కనిపించడం లేదు. నల్గొండ పట్టణంతో పాటు పరిసర మండలాల్లో పెద్ద ఎత్తున చెరువులు, కుంటలను రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆక్రమించి ప్రభుత్వ స్థలాల్లో ఫ్లాట్లు ఏర్పాటుచేసి విక్రయించినట్లు తెలుస్తోంది. అధికారులు వీటిపై నిఘా ఉంచి కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.