News August 20, 2025
ఆర్గనైజేషన్ సెక్రటరీగా జగిత్యాల జిల్లా వాసులు

తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీగా జగిత్యాల జిల్లా బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు మోతె ఉమాకాంత్, కార్యదర్శిగా మునుగోటి రమేష్ శర్మలను నియమిస్తూ తెలంగాణ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు వెన్నంపల్లి జగన్మోహన్ శర్మ మంగళవారం DSR గార్డెన్, హన్మకొండలో ధ్రువీకరణ పత్రం అందజేశారు. వీరి నియామకం పట్ల రాయికల్, జగిత్యాల బ్రాహ్మణ సంఘం సభ్యులు, తెలుగు పండితులు, తదితరులు హర్షం వ్యక్తం చేశారు.
Similar News
News August 20, 2025
విద్యుత్ కోతలు లేకుండా చూడాలి: కలెక్టర్

కోతలు లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరాకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నందున, సిబ్బంది ప్రవర్తన వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా స్పష్టం చేశారు. విద్యుత్ శాఖ అధికారులతో బుధవారం ఒంగోలులోని తన క్యాంపు కార్యాలయంలో ఆమె ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యుత్ పనులు సాగుతున్న గ్రామాలలో వేగవంతంగా పనులు పూర్తి చేయాలన్నారు.
News August 20, 2025
NGKL: కరెంట్ తీగలు… కడుపు కోతకు కారణమయ్యాయి!

గణపయ్యను హర్షధ్వానాలతో ఊరేగింపుగా తీసుకువస్తుండగా, ఆ మార్గంలో వేలాడుతున్న కరెంట్ తీగలు ఆ యువకుడి ప్రాణాన్ని బలిగొన్నాయి. ఆనందంగా మొదలైన వేడుక ఒక్కసారిగా విషాదంలోకి మారింది. స్థానికుల వివరాలు.. కోడేరు(M) నాగులపల్లితండా వాసి టోని(24) HYDలోని బండ్లగూడలో కుటుంబంతో నివాసముంటున్నారు. ట్రాక్టర్‌పై నిన్న భారీ వినాయకుడిని తీసుకొస్తున్నారు. ట్రాక్టర్ నడుపుతున్న టోనికి కరెంటు వైర్లు తగిలి చనిపోయాడు.
News August 20, 2025
అర్కండ్ల: పొలంలో మహిళకు పాముకాటు.. ఆసుపత్రికి తరలింపు

శంకరపట్నం మం. ఆర్కండ్లకు చెందిన చెర్ల రేణుక వ్యవసాయ పనులకు వెళ్లినప్పుడు పాముకాటుకు గురయ్యారు. గమనించిన తోటి రైతులు వెంటనే 108కి సమాచారం ఇచ్చారు. అప్పటికే ఆమెను ద్విచక్రవాహనంపై కేశవపట్నం వైపు తరలిస్తుండగా, మార్గమధ్యంలో మక్త గ్రామం వద్ద 108 అంబులెన్స్ సిబ్బంది ఈఎంటి సతీష్ రెడ్డి, పైలట్ గోపికృష్ణ ఆమెకు ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆమెను KNRలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.