News July 7, 2024
ఆర్జీయూకేటీ శ్రీకాకుళం క్యాంపస్ డైరెక్టర్ రాజీనామా

రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలోని శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ కేవీజీడీ బాలాజీ శనివారం రాజీనామా చేశారు. ఆయన రాజీనామా పత్రాన్ని ఈ-మెయిల్ ద్వారా ఆర్జీయూకేటీ ఛాన్సలర్ కె.సి రెడ్డికి పంపారు. 2023 నవంబరు 18న బాలాజీ బాధ్యతలు స్వీకరించినట్లు ట్రిపుల్ ఐటీ సిబ్బంది తెలిపారు.
Similar News
News August 31, 2025
శ్రీకాకుళం జిల్లాలో ఉద్యోగావకాశాలు

శ్రీకాకుళం జిల్లా వయోజన విద్యాశాఖలో ఖాళీగా ఉన్న 4 సూపర్‌వైజర్ పోస్టులకు సెప్టెంబర్ 5లోగా దరఖాస్తు చేసుకోవాలని DD అల్లు సోమేశ్వరరావు కోరారు. డిప్యుటేషన్ ప్రాతిపదికన ఏడాది పాటు పనిచేయాల్సి ఉంటుందన్నారు. అభ్యర్థుల వయస్సు 45ఏళ్లు లోపు ఉండాలన్నారు. MRPగా కనీసం 10ఏళ్లు పనిచేసిన సెకండరీ గ్రేడ్ టీచర్లు అర్హులన్నారు.
News August 31, 2025
తప్పుడు ప్రకటనలు మానుకోండి: ధర్మాన

ప్రజా సమస్యలను వదిలేసి సీఎం చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని వైసీపీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ మండిపడ్డారు. మబుగాం క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. రుషికొండ భవనాలపై చంద్రబాబు, పవన్ తప్పుడు ప్రకటనలు మానుకోవాలని హితవు పలికారు. రాష్ట్రంలో దివ్యాంగుల పింఛన్లు తీసి వారి కడుపు కొట్టొద్దని సూచించారు.
News August 31, 2025
SKLM: మహిళలకు హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్‌లో శిక్షణ

ఎస్సీ మహిళలకు హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్‌లో శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానించినట్లు ఎస్సీ కార్పొరేషన్ ఈడి గడ్డెమ్మ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో షెడ్యూల్డ్ కులాలకు చెందిన 20సంవత్సరాలు వయస్సు పైబడిన ఐదుగురు మహిళ అభ్యర్థులకు మాత్రమే హెవీ మోటార్ వెహికల్ డ్రైవర్ ట్రైనింగ్ ఉంటుందన్నారు. అర్హులైన ఎస్సీ మహిళలు జిల్లా షెడ్యుల్డ్ కులముల సేవా సహకార సంఘం కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు.