News November 11, 2025
ఆర్టీసీకి కార్గో లాభాల పంట!

విజయవాడ RTC జోనల్‌లో కార్గో సేవలు లాభాల పంట పండిస్తున్నాయి. గత ఏడాది మొత్తం రూ.114 కోట్ల ఆదాయం రాగా.. ఈ ఏడాది అక్టోబర్ నాటికే రూ. 120 కోట్లకు పైగా ఆదాయం వచ్చిందని అధికారులు చెబుతున్నారు. కొబ్బరి, అరటి పంట, ఇతర సరుకులను నేరుగా మార్కెట్ నుంచే రవాణా చేయడంతో లాభాలు పెరిగాయని అంటున్నారు. భవిష్యత్తులో ఇంటికి వచ్చి పార్సెల్ పికప్ చేసుకునే సదుపాయాన్ని కూడా తీసుకొచ్చే ఆలోచనలో RTC ఉన్నట్లు తెలుస్తోంది.
Similar News
News November 11, 2025
CM పర్యటనకు పటిష్ఠ బందోబస్తు: DIG

రాయచోటి నియోజకవర్గానికి విచ్చేస్తున్న సీఎం చంద్రబాబు పర్యటనకు పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ వెల్లడించారు. మంగళవారం హెలిపాడ్ ప్రాంగణం, ప్రజా వేదిక, కార్యకర్తల వేదికతో పాటు ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాలను ఎస్పీ ధీరజ్‌తో కలిసి ఆయన పరిశీలించారు.
News November 11, 2025
MBNR: ‘అబుల్ కలాం సేవలు మరువలేనివి’

స్వాతంత్ర్య సమరయోధుడిగా, కేంద్ర తొలి విద్యాశాఖమంత్రిగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ దేశానికి అందించిన సేవలు ఎప్పటికీ మరువలేమని మాజీ మంత్రులు అన్నారు. ఆయన జయంతిని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి కలాం చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. దేశ తొలి విద్యాశాఖ మంత్రిగా 11ఏళ్ల పాటు పనిచేసిన మౌలానాకు 1992లో భారతరత్న పురస్కారం లభించిందని కొనియాడారు.
News November 11, 2025
హార్ట్ బ్రేకింగ్.. బాంబ్ బ్లాస్ట్‌తో కుటుంబం రోడ్డుపైకి!

ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్‌లో మరణించినవారిలో కుటుంబానికి ఏకైక ఆధారమైన అశోక్ కూడా ఉన్నారు. మొత్తం కుటుంబంలో 8 మంది ఆయన సంపాదన మీదే ఆధారపడి జీవిస్తున్నారు. ఆయనకు నలుగురు పిల్లలు కాగా.. అందులో ముగ్గురు ఆడపిల్లలు, ఓ అబ్బాయి. తల్లితో పాటు అనారోగ్యంతో ఉన్న అన్నయ్య పోషణను కూడా అశోక్ చూసుకుంటున్నారు. వీరికి ఎలాంటి ఇబ్బంది రావొద్దని ఆయన పగటిపూట కండక్టర్‌గా, రాత్రిపూట సెక్యూరిటీ గార్డుగా పనిచేసేవారు.


