News July 23, 2024

ఆర్టీసీతో మహిళలకు రూ.2,350 కోట్లు ఆదా!: మంత్రి పొన్నం

image

మహాలక్ష్మి పథకం కింద తెలంగాణలో మహిళలు 68.60 కోట్ల సార్లు ఉచితంగా బస్సుల్లో ప్రయాణించారని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ తెలిపారు. ఫలితంగా రూ.2,350 కోట్లు ఆదా అయ్యాయని వివరించారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్‌టీసీ) అధికారులు, సిబ్బందితో బస్‌భవన్‌లో సమీక్ష నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. ఆర్‌టీసీ సిబ్బంది కృషి, క్రమశిక్షణ, అంకితభావం వల్లే పథకం విజయవంతమైందన్నారు.

Similar News

News November 5, 2024

మెదక్: రేపటి నుంచి సర్వే.. ఇవి దగ్గర ఉంచుకోండి !

image

ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా సమగ్ర ఇంటింటి సర్వే రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో 56 ప్రధాన, 19 అనుబంధం కలిపి మొత్తం 75 ప్రశ్నలుంటాయి. ఆధార్ కార్డులు, రైతులయితే అదనంగా ధరణి పాసుపుస్తకాలు, రేషన్ కార్డు, ఇంటి పన్ను దగ్గర పెట్టుకుంటే ఎన్యూమరేటర్లు వచ్చినపుడు సర్వే సులువుగా పూర్తవుతుంది. సర్వే సందర్భంగా ఎలాంటి ఫొటోలూ తీయరు. పత్రాలు తీసుకోరు. ఇచ్చిన సమాచారాన్ని గోప్యంగా ఉంచుతారు.

News November 5, 2024

పటాన్‌చెరు: ఇంటర్ విద్యార్థిని సూసైడ్ UPDATE

image

పటాన్‌చెరులోని ఐడీఏ బొల్లారం PS పరిధిలో <<14531325>>ఇంటర్ విద్యార్థిని<<>> ఉరివేసుకున్న విషయం తెలిసిందే. పోలీసుల వివరాలు.. వరంగల్ జిల్లా ఐనవోలుకు చెందిన విద్యార్థిని(16) బొల్లారంలోని నారాయణ కాలేజీలో ఫస్టియర్ చేస్తుంది. సోమవారం స్టడీ హవర్‌కు రాలేదని వెళ్లి చూడగా సెకండ్‌ఫ్లోర్‌లోని హాస్టల్‌లో ఉరేసుకొని కనిపించింది. ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయిందని, ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

News November 5, 2024

దుబ్బాక: చెట్టుకు ఢీకొన్న స్కూల్ పిల్లల ఆటో

image

దుబ్బాక మండలం పెద్ద చీకొడు గ్రామంలో ఘోర ప్రమాదం జరిగింది. కమ్మర్‌పల్లి గ్రామానికి చెందిన పిల్లలతో దుబ్బాకకు వెళ్తున్న ఆటో చికోడు వద్ద చెట్టుకు ఢీ కొట్టింది. ప్రమాదంలో పది మంది విద్యార్థులకు గాయాలు కాగా దుబ్బాక ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడ్డ ఇద్దరిని సిద్దిపేట ఆస్పత్రికి తరలించినట్లు తెలిసింది. కాగా ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సింది.