News March 7, 2025

ఆర్థికలోటుతోనే తులం బంగారం ఆలస్యం: పొంగులేటి

image

ఖమ్మం: పేదవారి కోసం ఇందిరమ్మ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం కూసుమంచి క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు మంత్రి జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్‌తో కలిసి కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగా లేని కారణంగా తులం బంగారం హామీ లేట్ అవుతుందని చెప్పారు. అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు మంజూరు చేస్తామన్నారు.

Similar News

News April 14, 2026

ఖమ్మం జిల్లాలో పెరిగిన కూలీ రేట్లు

image

ఖమ్మం జిల్లాలో సుతారీ మేస్త్రీలు, సహాయ కార్మికుల కూలీ రేట్లు పెంచుతూ కార్మిక శాఖ నిర్ణయం తీసుకుంది. సోమవారం బిల్డర్స్ అసోసియేషన్, కార్మిక సంఘాలతో నిర్వహించిన సమావేశంలో మేస్త్రీ కూలీ రూ.950 నుంచి రూ.1,050కు, సహాయకుల కూలీ రూ.670 నుంచి రూ.735కు పెంచినట్లు డిప్యూటీ కమిషనర్ విజయభాస్కర్ రెడ్డి తెలిపారు. పెరిగిన రేట్లు తక్షణమే అమల్లోకి వస్తాయని ఆయన స్పష్టం చేశారు.

News April 14, 2026

KMM: వడదెబ్బ నివారణకు జాగ్రత్తలు పాటించాలి: కలెక్టర్

image

ఖమ్మం జిల్లాలో పెరుగుతున్న ఎండల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, నీరు ఎక్కువగా తాగాలని కోరారు. చిన్నారులు, వృద్ధులు ఎండలో తిరగవద్దని, గొడుగు లేదా టోపీ ధరించాలని తెలిపారు. వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రికి వెళ్లాలని, తగిన జాగ్రత్తలతో ప్రాణాలను కాపాడుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.