News May 23, 2024
ఆర్థిక ఇబ్బందుల్లో సాలూరు లారీ పరిశ్రమ

రాష్ట్రంలో విజయవాడ తరువాత జిల్లాలో సాలూరు లారీ పరిశ్రమకు పెట్టింది పేరు. ఇక్కడ సుమారు 2300 వరకు లారీలు ఉన్నాయి. ఈ మోటారు పరిశ్రమపై 18 వేల కుటుంబాలు ప్రత్యక్షంగా పరోక్షంగాను ఆధారపడి జీవిస్తున్నాయి. ఇంతమందికి జీవనాధారమైన ఈ పరిశ్రమ పెరిగిన ఆయిల్, విడిభాగాలు ధరలకు అనుగుణంగా కిరాయిలు పెరగకపోవడంతో బాటు లోడింగ్ లేక అధిక మొత్తం లారీలు యార్డ్‌లోనే ఉంటున్నాయి. దీనివలన చాలా కుటుంబాల వారు రోడ్డున పడ్డారు.
Similar News
News February 27, 2026
VZM: జిల్లాలో 2.69 లక్షల మందికి రూ.114.83 కోట్ల పంపిణీ

జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద శనివారం 2,69,748 మందికి రూ.114.83 కోట్లు పింఛన్లు పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని రావివలస గ్రామ సచివాలయ పరిధిలో సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. చీపురుపల్లి నియోజకవర్గంలో 36,903 మందికి రూ.15.80 కోట్లు, చీపురుపల్లి మండలంలో 8,431 మందికి రూ.3.56 కోట్లు, రావివలస గ్రామంలో 387 మందికి రూ.16 లక్షలు అందజేయనున్నారు.
News February 27, 2026
చీపురుపల్లి: సీఎం వస్తున్నారు.. కీలక ప్రకటన ఉంటుందా..!

చీపురుపల్లి(M) రావివలసలో శనివారం CM చంద్రబాబు పర్యటించనున్న విషయం తెలిసిందే. దీంతో నియోజకవర్గంలో పలు సమస్యలపై సీఎం ప్రకటన చేస్తారని ప్రజలు నిరీక్షిస్తున్నారు. సుమారు 80 వేల మంది కోరుకుంటున్న RECS పునరుద్ధరణ, తోటపల్లి పిల్ల కాలువల నిర్మాణం, చీపురుపల్లి ఏరియా ఆసుపత్రికి, గరివిడి పశుసంవర్ధక కళాశాలకు అదనపు భవనాలు మంజూరు, చీపురుపల్లిలో ఇండోర్ స్టేడియం నిర్మాణం పూర్తిపై హామీ కోసం ఎదురుచూస్తున్నారు.
News February 27, 2026
విజయనగరం: సైకో కిల్లర్ ఉపేంద్ర బాబు హత్య

అనకాపల్లి(D) మాడుగుల(M) జంపినకు చెందిన సీరియల్ సైకో కిల్లర్ పెచ్చేటి ఉపేంద్ర బాబును గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. ఉపేంద్ర బాబు ఐదు మర్డర్ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ఇటీవల విజయనగరం జిల్లాలో చేసిన దొంగతనం కేసులో జైలుకు వెళ్లి, బెయిల్ మీద బయటకు వచ్చాడు. కాగా మారణాయుధాలతో ఉపేంద్ర బాబును హత్య చేసినట్లు ప్రాథమిక సమాచారం. ఘటనకు సంబంధించి మరిన్నివివరాలు తెలియాల్సి ఉంది.


