News August 3, 2024
ఆర్థిక ప్రణాళికతో సంపద సృష్టిపై జాతీయ సదస్సు
ఆర్థిక ప్రణాళికతో సంపద సృష్టిపై జాతీయ వెబినార్ ఈనెల 5వ తేదీన వైవీయూ కామర్స్ శాఖ, అసోషియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నది. వైవీయూలో వీసీ ప్రొ కె కృష్ణారెడ్డి, వెబినార్ కన్వీనర్, రిజిష్ట్రార్ ప్రొ ఎస్ రఘునాథరెడ్డి వెబినార్ పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ.. వెబినార్ పాల్గొనే వారికి రిజిస్ట్రేషన్ రుసుము లేదని, ఈ సర్టిఫికెట్లు జారీ చేస్తామన్నారు.
Similar News
News January 17, 2025
తిరుపతి రుయాలో కడప జిల్లా మహిళ మోసం
కడప జిల్లా వల్లూరుకు చెందిన శ్రీవాణి ఐదేళ్ల కిందట తిరుపతి రుయాలో ల్యాబ్ టెక్నిషియన్‌గా పనిచేసి ఆగిపోయింది. తాజాగా సంక్రాంతి రోజు కోటు వేసుకుని రుయాకు వెళ్లింది. ఓ రోగిని స్కానింగ్ రూములోకి తీసుకెళ్లి ఒంటిపై బంగారం ఉండకూదని చెప్పింది. గాజులు, చైన్లు తీసుకుంది. తర్వాత బయటకు వచ్చి రోగి బంధువుకు బంగారం ఇచ్చి.. ఓ చైన్ మాయం చేసింది. సెక్యూరిటీ సిబ్బంది శ్రీవాణి కోటులో చైన్ గుర్తించడంతో కేసు నమోదైంది.
News January 17, 2025
మైదుకూరులో సీఎం పర్యటన సాగేదిలా..!
సీఎం చంద్రబాబు ఈనెల 18న మైదుకూరులో పర్యటించనున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి కడపకు వస్తారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో మైదుకూరు కోర్టుకు చేరుకుంటారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అమలుపై ఆరా తీస్తారు. ఇందులో భాగంగా సీఎం ఇంటింటికీ తిరుగుతారు. తడి, పొడి చెత్త వేరు చేయడంపై ప్రజలకు ఏమేర అవగాహన ఉందో తెలుసుకుంటారు. దీంతో అధికారులు అప్రమత్తమై మైదుకూరులో స్వచ్ఛత పనులు చేస్తున్నారు.
News January 17, 2025
కడప: 23, 24 తేదీల్లో స్పోర్ట్స్ మీట్ – 2025
కడప నగరంలోని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ మైదానంలో ఈనెల 23, 24 తేదీల్లో రిపబ్లిక్ డే వేడుకల్లో భాగంగా స్పోర్ట్స్ మీట్ -2025 నిర్వహిస్తున్నట్లు కడప నగరపాలక సంస్థ అధికారులు తెలిపారు. 8 నుంచి 10వ తరగతి చదివే విద్యార్థులు ఈ మీట్‌లో పాల్గొనవచ్చని పేర్కొన్నారు. వాలీబాల్, రన్నింగ్ రేస్, కబడ్డీ, బాడ్మింటన్ క్రీడాంశాలలో పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ నెల 21లోపు ఎంట్రీలు నమోదు చేసుకోవాలన్నారు.