News May 7, 2025

‘ఆర్థిక రాజ‌ధాని ప్ర‌మాణాల‌కు అనుగుణంగా విశాఖ‌ను తీర్చిదిద్దాలి’

image

ఆర్థిక రాజ‌ధాని ప్ర‌మాణాల‌కు అనుగుణంగా విశాఖ‌ను తీర్చిదిద్దాలని జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి బాల వీరాంజ‌నేయ స్వామి పేర్కొన్నారు. శుక్రవారం విశాఖ కలెక్టరేట్లో నాయకులు, అధికారులతో సమావేశమయ్యారు. దేశంలోనే అత్య‌ధికంగా ఆదాయ వ‌న‌రులున్న న‌గ‌రంగా విశాఖను పేర్కొన్నారు. అభివృద్ధికి విశాఖలో అన్ని ర‌కాల అవ‌కాశాలున్నాయ‌ని, దానికి అనుగుణంగా ముందుకు సాగుదామ‌న్నారు. అనంతరం ఉగ్రదాడిలో మరణించిన వారికి సంతాపం తెలిపారు.

Similar News

News September 11, 2025

ఏపీ ఈపీడీసీఎల్ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్‌గా రామకృష్ణ ప్రసాద్

image

ఏపీ ఈపీడీసీఎల్ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ (సీవీవో)గా రిటైర్డ్ ఎస్పీ కె.వి.రామకృష్ణ ప్రసాద్ గురువారం విశాఖలోని సమస్త ప్రధాన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. 2024 ఆగస్టు నుంచి 2025 జూలై 31 వరకు ఆయన సీవీవోగా బాధ్యతలు నిర్వహించారు. ఆయన్ని మరో ఏడాది పాటు కాంట్రాక్టు పద్ధతిలో సీవీవోగా ప్రభుత్వం నియమించింది. సంస్థ సీఎండీ పృథ్విరాజ్‌ని ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు.

News September 11, 2025

తెలుగు వారికి అండగా ఉంటాం: పల్లా శ్రీనివాస్

image

టీడీపీ ఎల్లప్పుడూ తెలుగు వారి యోగా క్షేమాలు చూస్తుందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు వెల్లడించారు. నేపాల్‌లో చిక్కుకున్న తెలుగువారి కోసం నారా లోకేశ్ అన్ని ఏర్పాట్లు చేశాలని తెలిపారు. వారిని వైజాగ్ తీసుకొచ్చి వారి ప్రాంతాలకు పంపే ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. రుషికేశ్‌లో వరదల సమయం, ఉక్రెయిన్ వార్ సమయంలో ఇలాంటి విపత్కర పరిస్థితి‌లో తెలుగు వారికి టీడీపీ అండగా ఉందని గుర్తు చేశారు.

News September 11, 2025

విశాఖ: కాల్పుల కేసులో లొంగిపోయిన నిందితుడు

image

విశాఖలో సంచలనం సృష్టించిన చిలకపేట కాల్పుల కేసులో కానిస్టేబుల్ నాయుడు కోర్టులో లొంగిపొగా14 వరకు రిమాండ్ విధించారు. పలు ఆరోపణలతో ఆయన ఇది వరకే సస్పెండ్ అయ్యాడు. చేపల రాజేశ్‌పై కాల్పులు జరిపిన కేసులో ఇప్పటికే ఐదుగురిని అరెస్ట్ చేయగా A-3గా నాయుడు ఉన్నాడు. కోర్టులో లొగిపోవడానికి ముందు విశాఖ సీపీకి ‘తాను ఏ తప్పూ చేయలేదని’ వాట్సప్‌లో మెసేజ్ పెట్టినట్లు సమాచారం. సీఐ జీడీ బాబు కేసు దర్యాప్తు చేస్తున్నారు.