News February 3, 2026

ఆర్థిక శక్తిగా భారత్: ప్రధాని నాయకత్వంపై పవన్ ప్రశంసలు

image

ఒకే వారంలో రెండు కీలక వాణిజ్య ఒప్పందాల వైపు అడుగులు వేసి దేశ ఆర్థిక వ్యవస్థను ప్రధాని మోదీ శక్తిమంతం చేశారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొనియాడారు. ప్రధాని నేతృత్వంలో యురోపియన్ యూనియన్‌‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం, US టారిఫ్ ఛార్జీలను 18%కి తగ్గించే చర్యల వల్ల మార్కెట్లో పోటీతత్వం, రైతులకు ఆదాయం పెరుగుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా Xలో ప్రధానికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

Similar News

News February 6, 2026

INDతో మ్యాచును బాయ్‌కాట్ చేస్తే పాక్‌కే దెబ్బ!

image

T20 WCలో భారత్‌తో మ్యాచును బాయ్‌కాట్ చేస్తే పాకిస్థాన్‌కు గ్రూప్ స్టేజ్ దాటడమే కష్టంగా మారొచ్చు. ఈ మ్యాచ్ ఆడకపోతే గ్రూప్‌లోని మిగతా జట్లపై(USA, నమీబియా, నెదర్లాండ్స్) కచ్చితంగా గెలవాలి. లేదంటే NRRపై ఆధారపడాల్సి వస్తుంది. 2024 WCలో PAKను USA ఓడించింది. దీంతో ఈసారీ ఆ టీమ్ నుంచి పాక్‌కు ముప్పు ఉంది. ఈ నేపథ్యంలో INDతో మ్యాచ్ ఆడితేనే గెలుపు కోసం ప్రయత్నించేందుకు PAKకు మరో అవకాశం(మ్యాచ్) ఉంటుంది.

News February 6, 2026

ఆయిల్ ఫామ్.. టన్నుకు రూ.224 అదనం

image

AP: తెలంగాణా కంటే రాష్ట్రంలోని ఆయిల్ ఫామ్ రైతులకు టన్నుకు అదనంగా రూ.224 చెల్లిస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. 2025-26 ఏడాదిలో 20.01% ఆయిల్ ఎక్స్‌ట్రాక్షన్ రేషియో(ఓయూఆర్)ను ప్రభుత్వం ప్రకటించిందని.. దీని వల్ల టన్ను ఆయిల్ ఫామ్‌కు రూ.20,680 ధర లభించిందని తెలిపారు. తెలంగాణలో జనవరికి సంబంధించి పామాయిల్ రైతులకు టన్నుకి రూ.20,456 ధర వస్తే.. ఏపీలో అదనంగా రూ.224 లభించిందని పేర్కొన్నారు.

News February 6, 2026

377 విమానాల్లో రిపీటెడ్ లోపాలు

image

దేశంలో వరుస విమాన ప్రమాదాల వేళ GOVT డేటా కలవరపెడుతోంది. గతేడాది JAN నుంచి 6 ఎయిర్‌లైన్స్ పరిధిలోని 754 విమానాలను పరిశీలించగా 377 ఫ్లైట్లలో రిపీటెడ్ లోపాలు బయటపడ్డాయి. 191 ఎయిరిండియా, 148 ఇండిగో, 16 స్పైస్‌జెట్, 14 ఆకాశ ఎయిర్ ఇండియా విమానాల్లో లోపాలు పునరావృతమయ్యాయని తేలింది. ఈ నివేదికపై ఎయిరిండియా అధికారి స్పందిస్తూ ‘మేం విమానాలను క్షుణ్ణంగా తనిఖీ చేశాం. ఇవి మైనర్ సమస్యలు’ అని పేర్కొన్నారు.