News August 7, 2025

ఆర్ధిక అసమానతలు తొలగించడం పీ4 లక్ష్యం: ఇన్‌ఛార్జ్ కలెక్టర్

image

భీమవరంలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో బుధవారం ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలతో ‘పీ4’ కార్యక్రమంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఇన్‌ఛార్జ్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆర్థిక అసమానతలు, పేదరికం లేని సమాజాన్ని రూపొందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.

Similar News

News August 31, 2025

లింగ నిర్ధారణకు పరీక్షలు చేస్తే చర్యలు: కలెక్టర్ హెచ్చరిక

image

లింగ నిర్ధారణ పరీక్షలను ఎట్టిపరిస్థితుల్లోనూ సహించేది లేదని, స్కానింగ్ సెంటర్లపై డెకాయ్ ఆపరేషన్స్ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. భీమవరం కలెక్టరేట్‌లో జరిగిన మల్టీమెంబర్ అప్రోప్రియేట్ అథారిటీ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలోని అన్ని స్కానింగ్ సెంటర్లను మూడు నెలలకు ఒకసారి తనిఖీ చేయాలని అధికారులకు సూచించారు.

News August 31, 2025

రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలి: కలెక్టర్

image

రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ నాగరాణి ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్లో శనివారం వివిధ శాఖాల అధికారులతో జరిగిన సమావేశంలో మాట్లాడారు. రీ సర్వే, అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, పిజిఆర్ఎస్ ఫిర్యాదులు, రైస్ కార్డులు, క్యాస్ట్ వెరిఫికేషన్, కోర్టు కేసులు అంశాలపై జిల్లాలోని ఆర్డీవోలు, తహశీల్దారులు మండల సర్వేలతో సమీక్షించారు.

News August 30, 2025

శిశుమరణాలపై వైద్యాధికారులతో కలెక్టర్ సమీక్ష

image

తల్లి మరణిస్తే ఆ కుటుంబం అంతా ఎంతో ఇబ్బందులకు గురవుతుందని, జిల్లాలో మాతా శిశు మరణాలు జరగకుండా వైద్యులు అత్యంత అప్రమత్తతో చికిత్సలను అందజేయాలని జిల్లా కలెక్టర్ నాగరాణి స్పష్టం చేశారు. శనివారం జిల్లా కలెక్టరేట్లో వైద్య సిబ్బందితో జరిగిన సమీక్షలో మాట్లాడారు. కాగా.. జిల్లాలో ఈ ఏడాది జూలై నెలాఖరు వరకు ఆసుపత్రులలో రెండు మాతృ మరణాలు, నాలుగు శిశుమరణాలు నమోదయ్యాయి.