News March 21, 2025

ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్‌ స్నాతకోత్సవ వేడుకల్లో గవర్నర్

image

జవహర్‌‌నగర్ పరిధిలోని ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ (ACDS) బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ, మాస్టర్ ఆఫ్ డెంటల్ సర్జరీ విద్యార్థుల కోసం 19వ స్నాతకోత్సవ వేడుకను నిర్వహించింది. ముఖ్య అతిథిగా గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ విద్యార్థులకు డిగ్రీలను అందజేశారు. ప్రిన్సిపల్ డా.మమతా కౌశిక్ కళాశాల నివేదికను సమర్పించారు. ACDS ఛైర్మన్ మేజర్ జనరల్ అజయ్ మిశ్రా గ్రాడ్యుయేట్లు ఆదర్శవంతంగా పనిచేయాలన్నారు.

Similar News

News November 5, 2025

HYD: T-Hub దశాబ్దపు విజయం: KTR

image

5 NOV 2015న T-Hub ఆవిర్భావంతో కేసీఆర్ నాయకత్వంలో హైదరాబాద్ భారతదేశపు స్టార్టప్ రాజధానిగా నిలిచిందని KTR ‘X’ లో పోస్ట్ చేశారు. T-Hubతో మొదలై We-Hub, T-Works వంటి సంస్థలతో కూడిన ఈ అద్భుతమైన ఎకోసిస్టమ్‌ను ‘ఆధునిక భారతదేశానికి ముఖచిత్రం’ అన్న రతన్ టాటా వ్యాఖ్యలను గుర్తుచేశారు. గత దశాబ్దంలో T-Hub సాధించిన ఈ ఘనత తనకు గర్వకారణమని రాసుకొచ్చారు.

News November 5, 2025

వికారాబాద్: పూడూరుకు ఇండియన్ క్రికెటర్

image

వికారాబాద్ జిల్లా పూడూరు మండలానికి ఈరోజు ఇండియన్ క్రికెటర్, డీఎస్పీ మహమ్మద్ సిరాజ్ వచ్చారు. పూడూర్ మండలం పెద్ద ఉమ్మెంతల్ గ్రామంలో తాను కొన్న 2.35 ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వచ్చారు. దీంతో మండల కేంద్రంలో సందడి వాతావరణం నెలకొంది. క్రికెటర్ మహమ్మద్ సిరాజ్‌ను చూసేందుకు స్థానిక యువత MRO ఆఫీస్‌కు వచ్చారు. MRO విజయ్ కుమార్ సిరాజ్‌ను సన్మానించారు.

News November 5, 2025

చివరకు దళారులను ఆశ్రయించాల్సిందేనా..?

image

రాజన్న సిరిసిల్ల జిల్లాలో పత్తి కొనుగోలు చేసేందుకు సీసీఐ అధికారులు నాంపల్లి, సంకేపల్లి, సుద్దాల, తాళ్లపల్లి, గాలిపెల్లిలోని జిన్నింగ్ మిల్లులలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. గతంలో ఎకరాకు 12 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేసిన సీసీఐ ఈసారి గరిష్ఠంగా ఎకరాకు ఏడు క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేయనుండడంతో మిగతా పత్తిని అమ్ముకోవడానికి దళారులను ఆశ్రయించాల్సిందేనా అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.