News February 22, 2025

ఆర్మీ జవాన్‌పై దాడి.. ఇద్దరిపై కేసు నమోదు: SI

image

నర్సాపూర్(జి) మండలం గొల్లమాడ గ్రామంలో ఆర్మీ జవాన్‌పై దాడి చేసిన ఘటనలో ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సాయి కిరణ్ శుక్రవారం తెలిపారు. తిమ్మాపూర్ గ్రామానికి చెందిన పోశెట్టి, భూమేష్ గురువారం రాత్రి గొల్లమాడ గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ భోజరాజుపై దాడి చేశారన్నారు. తలకు బలమైన గాయం కావడంతో చికిత్స నిమిత్తం నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు.

Similar News

News November 8, 2025

మిర్యాలగూడ: మత్తు మాత్రలు అమ్ముతున్న ముఠా అరెస్ట్

image

మత్తు మాత్రలను విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తుల ముఠాను అరెస్టు చేసినట్లు డీఎస్పీ రాజశేఖర్ రాజు తెలిపారు. శనివారం వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఆయన వివరాలు వెల్లడించారు. ఈదులగూడ చౌరస్తా వద్ద వాహన తనిఖీల్లో అనుమానాస్పదంగా కనిపించిన వీరిని పోలీసులు పట్టుకున్నారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా పాస్మో ప్రోగ్సి వొన్ ప్లస్ మాత్రలను అధిక ధరకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు.

News November 8, 2025

న్యూస్ రౌండప్

image

▶ బీజేపీ కురువృద్ధుడు ఎల్‌కే అద్వానీని కలిసిన PM మోదీ. అద్వానీ పుట్టినరోజు సందర్భంగా విషెస్
▶ USలో అనారోగ్యంతో APలోని కారంచేడుకు చెందిన విద్యార్థిని రాజ్యలక్ష్మి(23) మృతి
▶ UPA హయాంలో 88వేల మంది అక్రమ వలసదారులను తిప్పి పంపామన్న కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్
▶ బిహార్ ఎన్నికల వేళ అన్నదమ్ములు తేజస్వీ యాదవ్‌, తేజ్ ప్రతాప్ మధ్య ముదిరిన వైరం.. సోదరుడితో ఇక ఎన్నటికీ బంధం ఉండదన్న తేజ్ ప్రతాప్

News November 8, 2025

ఎర్రచందనం దుంగలు పట్టుబడితే ఇలా చేస్తారు..!

image

ఎర్రచందనం దుంగలు ఎక్కడ పట్టుబడిన ఏపీకి అప్పగించేలా కేంద్రం నుంచి ప్రత్యేక జీవో తెచ్చారు. దుంగలు పట్టుబడిన వెంటనే వాటికి జీయో ట్యాగింగ్‌తో పాటు బార్ కోడ్‌ను ఏర్పాటు చేస్తారు. దీని ద్వారా ఎన్ని దుంగలు ఉన్నాయి, వాటి గ్రేడింగ్ ఏమిటి అనే వివరాలు డిజిటలైజేషనే చేయనున్నారు. త్వరలో ఇందుకు సంబంధించి చర్యలు తీసుకోనున్నారు.