News June 27, 2024

ఆర్మూర్ అభివృద్ధి కోసం పోరాటానికి సిద్ధం: ఎమ్మెల్యే

image

ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాసారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సొంత నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించగా, ఆర్మూర్ నియోజకవర్గంలోనూ పైలెట్ ప్రాజెక్టు కింద ఇంటిగ్రేటెడ్ పాఠశాలను నిర్మించాలన్నారు. దీనిపై వారం రోజులలో ప్రభుత్వం నిర్ణయం తెలపాలన్నారు. లేకపోతే దీక్ష చేయడానికి అనుమతి ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు.

Similar News

News July 1, 2024

NZB: మురుగు కాలువలలో పడి యువకుడి మృతి

image

నిజామాబాద్ నగరంలోని రెండో టౌన్ పరిధిలో గుర్తు తెలియని యువకుడు మురుగు కాలువలో పడి మృతి చెందాడు. సోమవారం తెల్లవారుజామున కాలువలో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం అందించారు. రెండో పోలీస్ స్టేషన్ ఎస్సై రామ్ అక్కడికి చేరుకొని విచారణ చేపట్టారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.

News July 1, 2024

NZB: కుటుంబ కలహాలతో వ్యక్తి సూసైడ్

image

భార్యాభర్తల మధ్య గొడవలు రావడంతో కలత చెంది ఓ వ్యక్తి ఉరివేసుకుని మృతి చెందారు. ఎస్సై యాదగిరి గౌడ్ తెలిపిన వివరాలు.. సిద్ధాపూర్ గ్రామానికి చెందిన సుద్ధపల్లి చంద్రన్న(47) వ్యక్తి కొంతకాలంగా నవీపేట మండలం జన్నేపల్లిలో కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నారు. కుటుంబ కలహాల కారణంగా జీవితంపై విరక్తి చెంది ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పారు. కేసు, దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.

News July 1, 2024

కామారెడ్డి: టమాట రైతు ‘పంట’ పండింది

image

కామారెడ్డి జిల్లా సదాశివనగర్ ​మండలం కుప్రియాల్​లో టమాట రైతు పంట పడింది. గ్రామానికి చెందిన స్వరూప భూంరెడ్డి దంపతులు ఎకరం భూమిలో రెండు నెలల మల్చింగ్​పద్ధతిలో టమాట సాగు చేశారు. ప్రతి రోజు టమాటలను తెంపి 30కి పైగా బాక్సుల్లో కామారెడ్డి, HYDకు తరలిస్తున్నామని, ప్రస్తుతం కిలో టమాటా రూ.70 నుంచి రూ. 100 వరకు పలకడంతో.. రూ. 10 లక్షల లాభం ఉందని సదరు రైతు తెలిపారు.