News January 2, 2025

ఆర్మూర్: చేపల వేటకు వెళ్లి ఒకరి మృతి

image

చేపల వేటకు వెళ్లి ఒకరు మృతి చెందిన ఘటన ఆలూర్ మండలం దేగాం గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. ఆర్మూరు సీఐ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. కేశవ్ గంగాధర్ అనే వ్యక్తి ఆర్మూర్ మండలం దేగాం గ్రామానికి 6 నెలల క్రితం బతుకుదెరువు కోసం వచ్చాడు. బుధవారం ఉదయం 11 గంటల సమయంలో నీటి కాలువలో చేపలు పట్టడానికి వెళ్లగా ఈత రాకపోవడంతో ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు. 

Similar News

News January 5, 2025

KMR: సాక్ష్యాలు పక్కాగా సేకరించాలి: అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ 

image

కేసుల పరిశోధనలో ఆడియో, వీడియో, ఎలక్ట్రానిక్, సైంటిఫిక్ మోడ్‌లలో సాక్ష్యాలను పక్కాగా సేకరించాలని అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అశోక్ శివరాం పోలీసులకు సూచించారు. శనివారం జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల SHOలతో విచారణ, సాక్ష్యాధారాల సేకరణలో కీలకమైన అంశాలపై పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో కామారెడ్డి సబ్ డివిజన్ ఏఎస్పీ చైతన్య రెడ్డి, పీపీలు రాజగోపాల్ గౌడ్, దామోదర్ రెడ్డి, పోలీసులు పాల్గొన్నారు.

News January 4, 2025

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థాయి సైన్స్ క్విజ్ పోటీ

image

మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా విద్యార్థులకు శనివారం నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థాయి సైన్స్ క్విజ్ -2025 పోటీ నిర్వహించారు. గెలుపొందిన వారికి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ నిజామాబాద్ డివిజన్ డిప్యూటీ కమిషనర్ వి.సోమిరెడ్డి, ఎక్సైజ్ సూపరింటెండెంట్లు మల్లారెడ్డి, హనుమంతురావు, ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ చంద్రభాన్ బహుమతులు అందించారు.

News January 4, 2025

NZB: విద్యార్థులు డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి: రాజురెడ్డి

image

విద్యార్థులు డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని కాకతీయ సాండ్ బాక్స్ వ్యవస్థాపకులు రాజు రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు ఉన్నత ఆశయాలను లక్ష్యాలుగా ఎంచుకోవాలని సూచించారు. నిజామాబాద్ అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ బస్వారెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులు డ్రగ్స్ వల్ల కలిగే అనార్థాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. తన చుట్టూ ఉన్న వారిని చైతన్యం చేయాలని కోరారు.