News October 7, 2025

ఆర్మూర్: పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించాలి: సబ్ కలెక్టర్

image

ఆర్మూర్ డివిజన్ స్థాయిలో గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి ప్రిసైడింగ్ అధికారుల శిక్షణ కార్యక్రమానికి సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియా సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఎన్నికల విధులలో పాల్గొనే ప్రిసైడింగ్ అధికారులు క్షణక్షణం అప్రమత్తతో ఉంటూ ఎలక్షన్ కమిషన్ సూచనలు పాటిస్తూ ఎన్నికలు సజావుగా నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో DLPO శివకృష్ణ, ఎంపీడీఓలు శివాజీ, గంగాధర్ తదితరులున్నారు.

Similar News

News October 7, 2025

లైసెన్స్ ఆయుధాలు కలిగినవారు అప్పగించాలి: NZB సీపీ

image

స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా లైసెన్స్ పొందిన ఆయుధాలను వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్లలో అప్పగించాలని సీపీ సాయి చైతన్య ఒక ప్రకటనలో తెలిపారు. సెక్షన్ 21 ఆఫ్ ఆర్మ్స్ యాక్ట్, 1959 ప్రకారం, జిల్లా వ్యాప్తంగా ఈ నెల 9వ తేదీలోపు ఆయుధాలను జమ చేయాలని ఆయన నోటిఫికేషన్ జారీచేశారు. ఆయుధాలు జమ చేయనివారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు.

News October 7, 2025

NZB: కలెక్టరేట్‌లో వాల్మీకి జయంతి

image

వాల్మీకి జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో అధికారికంగా నిర్వహించారు. కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

News October 7, 2025

NZB: ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన వీరుడు కొమురం భీం: కల్వకుంట్ల కవిత

image

జల్, జంగల్, జమీన్ అనే గొప్ప సంకల్పంతో ఆదివాసీల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన వీరుడు కొమురం భీం అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. ఆయన నినాదం, పోరాట స్ఫూర్తితోనే తెలంగాణ ఉద్యమం సాగిందన్నారు. అలాంటి మహానీయుడి త్యాగాలను ఆయన వర్థంతి సందర్భంగా మరోసారి స్మరించుకుందామన్నారు. ఆయనకు నివాళి అర్పిస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు.