News April 6, 2025
ఆర్మూర్: పిరమిడ్ ధ్యాన మందిరాన్ని సందర్శించిన సీపీ

ఆర్మూర్ పట్టణంలోని తెలంగాణ రాష్ట్రంలోని అతి పెద్ద 2వ పిరమిడ్ నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రాన్ని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదివారం సందర్శించారు. ఇక్కడి పిరమిడ్ విశిష్టతను సీపీకి వివరించామని PSSM జిల్లా అధ్యక్షుడు సాయికృష్ణారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ సీఐ సత్యనారాయణ, PSSM సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
Similar News
News April 9, 2025
NZB: 29 మంది ఉద్యోగులకు పురస్కారాలు

ఆర్టీసీలో పని చేస్తున్న 29 మంది ఉద్యోగులకు త్రైమాసిక ప్రగతి చక్రం పురస్కారాలు అందజేశారు. నిజామాబాద్-1 డిపోలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో రీజినల్ మేనేజర్ టీ.జోత్స్న చేతుల మీదుగా ఈ పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ రీజినల్ మేనేజర్ మధుసూదన్, డిపో మేనేజర్లు, పర్సనల్ ఆఫీసర్, సూపర్ వైజర్లు, ఉద్యోగులు పాల్గొన్నారు.
News April 8, 2025
NZB: నిర్మాణాలు చేపట్టేలా లబ్దిదారులను ప్రోత్సహించాలి: కలెక్టర్

ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు త్వరతగతిన నిర్మాణాలు చేపట్టేలా వారిని అన్ని విధాలుగా ప్రోత్సహించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. ఇళ్ల మంజూరైన వారందరు వెంటనే నిర్మాణాలు ప్రారంభించేలా తగిన తోడ్పాటును అందించాలన్నారు. ఇప్పటికే నిర్మాణాలు ప్రారంభించిన వారు నిర్దేశిత గడువు లోగా, నిబంధనలకు అనుగుణంగా నాణ్యతతో నిర్మాణ పనులు పూర్తి చేసుకునేలా క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలన్నారు.
News April 8, 2025
సిరికొండ: కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించాలి: కలెక్టర్

కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు చేర్చాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశించారు. మంగళవారం ఆయన సిరికొండ మండలం చిన్నవాల్గోట్ గ్రామంలో ఐకేపీ మహిళా సంఘాల, సహకార సంఘాల ఆధ్వర్యంలో కొనసాగుతున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి మాట్లాడారు. రైస్ మిల్లుల వద్ద ధాన్యాన్ని వెంటనే అన్ లోడ్ చేసుకుంటున్నారా లేదా అన్నది క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు.