News August 22, 2025

ఆర్మూర్: బీజేపీ జిల్లా కార్యదర్శిగా పోల్కం వేణు నియామకం

image

ఆర్మూర్ పట్టణానికి చెందిన పోల్కం వేణును భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యదర్శిగా పార్టీ అధిష్ఠానం నియమించింది. పోల్కం వేణు మాట్లాడుతూ.. బీజేపీ బలోపేతానికి కృషి చేస్తానని, రానున్న ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించుకుంటామన్నారు. ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి, జాతీయ పసుపు బోర్డ్ ఛైర్మన్ పల్లె గంగారెడ్డి, జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులచారికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Similar News

News August 22, 2025

నిజామాబాద్: పోలీస్ పర్సనల్ అధికారుల శిక్షణ

image

పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న వారికి PSO శిక్షణ కార్యక్రమాన్ని పోలీస్ కమాండ్ కంట్రోల్ హాల్‌లో సీపీ సాయి చైతన్య శుక్రవారం ప్రారంభించారు. సీపీ మాట్లాడుతూ.. VIPల భద్రతలో సేవలు అందించే PSOల పాత్ర అత్యంత ముఖ్యమైందన్నారు. నైపుణ్యాలను మెరుగుపరచడానికి, అత్యాధునిక విధానాలపై అవగాహన కల్పించడానికి, అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యలపై శిక్షణ ఇచ్చామన్నారు.

News August 22, 2025

నిజామాబాద్: గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే ధ్యేయం: ఎమ్మెల్యే

image

గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా పనుల జాతర కార్యక్రమాన్ని చేపట్టిందని రూరల్ ఎమ్మెల్యే డా.భూపతి రెడ్డి వెల్లడించారు. శుక్రవారం నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని పాల్ద గ్రామంలో పనుల జాతరలో రూ.12 లక్షల వ్యయంతో నూతన అంగన్‌వాడీ భవన నిర్మాణానికి శుక్రవారం కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, ఇతర అధికారులతో కలిసి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.

News August 22, 2025

ఆర్మూర్: ‘ప్రైవేట్ పాఠశాలకు నోటీసులు జారీ చేశాం’

image

ఆర్మూర్ పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థులకు జారీ చేసే ట్రాన్స్‌ఫార్మర్ సర్టిఫికెట్‌కి డబ్బులు వసూలు చేసినట్టు వచ్చిన సమాచారం మేరకు ఆ పాఠశాలకు నోటీసులు జారీ చేశామని మండల విద్యాశాఖ అధికారి రాజా గంగారం ఈరోజు తెలిపారు. ఫీజుల పెండింగ్, టీసీ విషయంలో విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తే సంబంధిత యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.