News September 13, 2024

ఆర్మూర్: 108 రకాల నైవేద్యాలతో వినాయకుడి పూజ

image

ఆర్మూర్ పట్టణంలోని మహాలక్మి కాలనీలో గల శ్రీ మహాలక్ష్మి గణేశ్ మండలి ఆధ్వర్యంలో గురువారం రాత్రి 108 రకాల నైవేద్యాలతో వినాయకుడి పూజలు నిర్వహించారు. గణేశ్ ఉత్సవాల సందర్భంగా కాలనీలోని మహిళలు 108 రకాల నైవేద్యాలను స్వామివారికి సమర్పించి ప్రత్యేకంగా అలంకరించారు. కాలనీవాసులు పెద్దఎత్తున పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.

Similar News

News October 4, 2024

ప్రతిపక్షాల కుట్రలు తిప్పి కొట్టాలి: పొన్నం ప్రభాకర్

image

ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న కుట్రలను తిప్పి కొట్టాలని రాష్ట్ర రవాణా శాఖామంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. బిక్కనూరు మండల కేంద్రంలో ఆయన మాట్లాడారు. అన్ని వర్గాల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తుందని గుర్తు చేశారు. రైతులను ప్రతిపక్ష పార్టీలు తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో పార్టీ శ్రేణులు వారి మాటలను తిప్పి కొట్టాలన్నారు.

News October 4, 2024

పిట్లం: ఇంటి నుంచి వెళ్లి చెరువులో శవమై తేలాడు..!

image

ఇంటి నుంచి వెళ్లిన ఓ వ్యక్తి చెరువులో శవమై కనిపించాడు. స్థానికుల వివరాలిలా..పిట్లం గ్రామానికి చెందిన జంగం విఠల్ గురువారం మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. వెళ్లిన అతను రాక పోయేసరికి కుటుంబీకులు ఎక్కడ వెతికినా జాడ లేదు. శుక్రవారం మారేడు చెరువు వైపు వెళ్లే వారికి చెరువులో విఠల్ శవం తేలియాడుతూ కనిపించింది. పోలీసులకు సమాచారం అందించగా ఘటనా స్థలికి చేరుకొని శవాన్ని బయటకు తీశారు.

News October 4, 2024

CM రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు: నిఖత్ జరీన్

image

TG పోలీసు శాఖలో DSP పదవితో సత్కరించినందుకు CM రేవంత్ రెడ్డికి బాక్సర్ నిఖత్ జరీన్ ‘X’ వేదికగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. CM రేవంత్ రెడ్డి చేతుల మీదుగా లాఠీని అందుకున్న ఫోటోలను జత చేసిన ఆమె.. క్రీడలు తనకు మంచి వేదికను అందించాయని తెలిపారు. ఆ స్ఫూర్తి తనకు మరింత సామర్థ్యంతో సేవ చేయడానికి అనుమతి ఇచ్చిందని పేర్కొన్నారు. ఇది తన విజయం మాత్రమే కాదని సమిష్ఠి విజయమని పోస్టు చేశారు.