News March 30, 2025
ఆర్యు డిగ్రీ సెమిస్టర్ ఫలితాలు విడుదల

రాయలసీమ యూనివర్సిటీ 1,3,5 సెమిస్టర్ డిగ్రీ ఫలితాలను ఆదివారం యూనివర్సిటీ ఇన్‌ఛార్జి ఉపకులపతి ఉమా ఆదేశాల మేరకు విడుదల చేశారు. 1వ సెమిస్టర్‌లో 7,643 మంది పరీక్ష రాయగా 3,827 మంది ఉత్తీర్ణత సాధించారు, 3వ సెమిస్టర్‌లో 6,169 మంది పరీక్ష రాయగా 3,134 ఉత్తీర్ణత సాధించారు. 5వ సెమిస్టర్ 5,709 మంది పరీక్ష రాయగా 4,097 మంది ఉత్తీర్ణత సాధించారు. వీటితోపాటు సప్లమెంటరీ పరీక్షల ఫలితాలు కూడా విడుదల చేశారు.
Similar News
News April 1, 2025
కర్నూలు: టెన్త్ పరీక్షలకు 430 మంది గైర్హాజరు- డీఈఓ

కర్నూలు జిల్లా వ్యాప్తంగా మంగళవారం నిర్వహించిన పదో తరగతి పరీక్షల్లో మంగళవారం 430 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారైనట్లు డీఈఓ శామ్యూల్ పాల్ తెలిపారు. రెగ్యులర్ విధానంలో 293 మంది ఉండగా, ప్రైవేట్ విధానంలో 137 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారన్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 31,990 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి ఘర్షణలు చోటుచేసుకోలేదన్నారు.
News April 1, 2025
కర్నూలు: సెక్షన్ 11 నోటీస్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు- సబ్ కలెక్టర్

రీ-సర్వే జరుగుతున్న గ్రామాల్లో 9(2) నోటీసులోని విస్తీర్ణంపై అభ్యంతరాలు ఉంటే సెక్షన్ 11 నోటీస్ ద్వారా మొబైల్ మెజిస్ట్రేట్‌కు ఫిర్యాదు చేయవచ్చునని ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ పేర్కొన్నారు. మంగళవారం ఆదోని మండలంలోని పైలట్ గ్రామంగా ఎన్నికైన పెసలబండ గ్రామంలో జరుగుతున్న రీ-సర్వే ప్రక్రియను ఆయన పరిశీలించి, రైతులకు 9(2) నోటీసులు అందజేశారు. గ్రామంలో మొత్తం 1591.58 ఎకరాలు, 474 ఖాతాలు ఉన్నాయన్నారు.
News April 1, 2025
కర్నూలు: పరీక్షా కేంద్రంలో కలెక్టర్ తనిఖీ

పదో తరగతి పరీక్షల్లో భాగంగా మంగళవారం జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా కర్నూలు నగరంలోని దామోదరం సంజీవయ్య, స్మారక మున్సిపల్ హై స్కూల్ పరీక్షా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ రంజిత్ బాషా మాట్లాడుతూ.. విద్యార్థులకు మెరుగైన సదుపాయాలను కల్పించడంలో అధికారులు సఫలమయ్యారని అన్నారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా అధికారులు చూసుకోవాలని ఆదేశించారు.