News January 12, 2026
ఆర్సీబీ ఘన విజయం

WPL-2026లో యూపీ వారియర్స్‌పై ఆర్సీబీ ఘన విజయం సాధించింది. 144 పరుగుల లక్ష్యాన్ని 12.1 ఓవర్లలో వికెట్ నష్టపోయి ఛేదించింది. ఓపెనర్ హారిస్(85) 10 ఫోర్లు, 5 సిక్సర్లతో విధ్వంసం సృష్టించగా మరో ఓపెనర్ స్మృతి(47*) ఆమెకు సహకారం అందించారు. హారిస్ ఔటైనా రిచా(4*)తో కలిసి స్మృతి జట్టును విజయతీరాలకు చేర్చారు. ఇది ఆర్సీబీకి వరుసగా రెండో విజయం. మరోవైపు యూపీ ఆడిన రెండు మ్యాచుల్లోనూ పరాజయం పాలైంది.
Similar News
News March 13, 2026
రేపటి నుంచి టెన్త్ పరీక్షలు.. 5min ఆలస్యమైనా అనుమతి

TG: రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు రేపు ప్రారంభం కానున్నాయి. ఉ.9.30 గంటలకు పరీక్ష మొదలవుతుందని, ఉ.9.35 వరకూ స్టూడెంట్స్‌ను ఎగ్జామ్ హాలులోకి అనుమతిస్తామని అధికారులు స్పష్టం చేశారు. మొత్తం 5,28,239 మంది విద్యార్థులు ఎగ్జామ్స్ రాయనుండగా 2,676 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. స్టూడెంట్స్ అరగంట ముందే ఎగ్జామ్ సెంటర్‌కు చేరుకోవాలని అధికారులు సూచించారు.
News March 13, 2026
నేటి నుంచి మరోసారి థియేటర్లలో ‘ధురంధర్’

బాలీవుడ్ సూపర్ హిట్ ఫిల్మ్ ‘ధురంధర్’ ఇవాళ థియేటర్లలో రీ రిలీజ్ కానుంది. వరల్డ్ వైడ్‌గా వెయ్యికి పైగా స్క్రీన్లలో 1250కి పైగా షోలు వేయనున్నట్లు నిర్మాణ సంస్థ జియో స్టూడియోస్ ప్రకటించింది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ గత ఏడాది డిసెంబర్ 5న విడుదలై రూ.1350కోట్ల వసూళ్లు రాబట్టింది. దీనికి సీక్వెల్‌గా రూపొందిన ‘ధురంధర్-2’ ఈ నెల 19న తెలుగులోనూ విడుదల కానుంది.
News March 13, 2026
మొజ్తబా ఓ కీలుబొమ్మ: నెతన్యాహు

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీని ఇజ్రాయెల్ PM నెతన్యాహు విమర్శించారు. ఆయన రివల్యూషనరీ గార్డ్స్ కీలుబొమ్మ అని, బయటకు కూడా రాలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్‌కు చెందిన టాప్ న్యూక్లియర్ సైంటిస్ట్ మరణించారని తెలిపారు. ‘ఇరాన్ ప్రజలు స్వేచ్ఛా మార్గం వైపు అడుగులు వేసే సమయం వచ్చింది. మేం వారికి అండగా ఉంటాం. కానీ మార్పు మాత్రం వారి చేతుల్లోనే ఉంది’ అని పేర్కొన్నారు.


