News March 21, 2026

ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్‌పై పాడేరులో విస్తృత ప్రచారం

image

అనకాపల్లి జిల్లాలో ఈనెల 23న సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేయనున్నారు. శనివారం పాడేరులో టీడీపీ ఇన్‌ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ భారీ ప్రాజెక్టు ద్వారా ఉత్తరాంధ్రలో 60 వేల మందికి ఉపాధి లభిస్తుందని, ముఖ్యంగా గిరిజన యువతకు ఎంతో మేలు జరుగుతుందని ఆమె వివరించారు.

Similar News

News March 27, 2026

నీట్‌కు ప్రిపేర్ అవుతూ..ఉగ్రవాదులతో సంబంధం పెట్టుకొని జైలుకెళ్లాడు

image

విజయవాడ ఉగ్రకేసులో తాజాగా అరెస్టైన షాద్‌మాన్‌ నీట్‌ పరీక్షకు ప్రిపేర్ అవుతూ తీవ్రవాద కార్యకలాపాలకు ఆకర్షితుడైనట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. పాట్నా(బిహార్)కు చెందిన షాద్‌మాన్‌ పేరెంట్స్ టీచర్స్ కాగా.. వారు పేదలకు ఉచితంగా చదువు చెబుతూ స్థానికంగా గౌరవప్రదంగా జీవిస్తున్నారు. షాద్‌మాన్‌‌ను అరెస్ట్ చేసిన పోలీసులు అతడి ల్యాప్‌టాప్, మొబైల్‌ను స్వాధీనం చేసుకున్నారు.

News March 27, 2026

తిరుపతి: రైల్వే స్టేషన్ సమీపంలో యువకుడి మృతి

image

పాకాల రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని యువకుడు మృతి చెందాడని RPF చిత్తూరు SI ధర్మేందర్ రాజు తెలిపారు. మృతుని వయస్సు సుమారు 25 ఏళ్లు ఉంటుంది. తెలుపు రంగు నల్ల గళ్ల చొక్కా ధరించి ఉన్నాడు. తిరుపతికి వెళ్తున్న రైల్లో నుంచి జారి పడినట్లు అనుమానిస్తున్నారు. మృతుని వద్ద ఎటువంటి ఆధారాలు లేవు. మృతదేహాన్ని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News March 27, 2026

పెంటగాన్‌లో పెరిగిన పిజ్జా ఆర్డర్లు.. ఏం జరగబోతోంది?

image

US రక్షణ కార్యాలయం పెంటగాన్ చుట్టుపక్కల <<18781285>>పిజ్జా ఆర్డర్లు<<>> పెరిగితే ఏదో ఒక దేశానికి మూడినట్లేనని ప్రచారం ఎప్పటినుంచో ఉంది. తాజాగా పాపా జాన్స్ ఆర్డర్లు 296%, డొమినోస్ 208%, పిజాటో ఆర్డర్లు 200% పెరిగాయి. పశ్చిమాసియాకు US మరిన్ని బలగాలను పంపనుందనే వార్తల నేపథ్యంలో ఇలా జరగడం గమనార్హం. ‘కొన్ని గంటల్లో కీలక ప్రకటన’ అంటూ వైట్‌హౌస్ చేసిన ట్వీట్ దీనికి బలాన్ని చేకూరుస్తోంది. అసలేం జరగబోతోంది?