News April 16, 2025

ఆలమూరు: నగ్న చిత్రాలతో బ్లాక్ మెయిలింగ్.. నిందితుడి అరెస్టు

image

ఆలమూరు మండలం చెముడులంక యువతిని నగ్న చిత్రాలతో డబ్బు కోసం బెదిరిస్తున్న కర్నూలు(D) కల్లూరు(M) తటకనాపల్లికి చెందిన హరీశ్‌ను అరెస్టు చేశామని SI అశోక్ తెలిపారు. అతడిని కోర్టులో హాజరుపరచగా 14 రోజులు రిమాండ్ విధించారన్నారు. మూడేళ్ల క్రితం స్నాప్ యాప్ ద్వారా యువతి పరిచయమైంది. దీంతో ఆమె నగ్నంగా వీడియో కాల్ మాట్లాడుతుండగా స్క్రీన్ షాట్స్ తీసి 3ఇన్‌స్టా ఖాతాల్లో పోస్ట్ చేసి వేధించాడని వెల్లడించారు.

Similar News

News November 10, 2025

ఢిల్లీ పేలుడుపై ప్రధాని మోదీ ఆరా

image

ఢిల్లీ <<18252218>>పేలుడు<<>> ఘటనపై ప్రధాని మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఫోన్ చేశారు. ఘటన ఎలా జరిగిందనే కారణాలకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మరోవైపు ఓ అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పేలుడుకు సంబంధించి దర్యాప్తు సంస్థలు అతడిని ప్రశ్నిస్తున్నాయి. పేలుడు తీవ్రతను బట్టి చూస్తే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

News November 10, 2025

VKB: ఈవీఎం గోడౌన్‌ను పరిశీలించిన కలెక్టర్

image

ఈవీఎంలను జాగ్రత్తగా భద్రపరచాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. సోమవారం వికారాబాద్ పట్టణంలోని తహశీల్దార్ కార్యాలయం సమీపంలో భద్రపరిచిన ఈవీఎంల గోడౌన్‌ను జిల్లా కలెక్టర్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈవీఎంలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తగా భద్రపరచాలని తెలిపారు. సాధారణ పరిశీలనలో భాగంగా పరిశీలించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.

News November 10, 2025

JGTL: 80లక్షల MTల ధాన్యం కొనుగోళ్లే లక్ష్యం

image

వానాకాలం పంట సీజన్‌కు సంబంధించి రికార్డు స్థాయిలో 80 లక్షల MTల అంచనాతో ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామని మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి అన్నారు. పంట కొనుగోళ్లపై కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోగా చెల్లింపులు చేస్తామని ప్రభుత్వం రైతులకు కమిట్మెంట్ ఇచ్చిందని, దానికనుగుణంగా వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. అడిషనల్ కలెక్టర్ తదితరులున్నారు.