News March 29, 2025
ఆలమూరు: నూకాంబికమ్మను దర్శించిన ప్రముఖ హాస్య నటుడు

ఆలమూరు మండలం చింతలూరు నూకాంబికా అమ్మవారిని ప్రముఖ సినీ నటుడు, రచయిత, కళాకారుడు పోలాప్రగడ జనార్ధన్ రావు (జెన్నీ) శనివారం దర్శించుకున్నారు. అమలాపురంలో జరుగుతున్న ఒక సినిమా షూటింగ్‌కు వచ్చిన ఆయన తన అమ్మమ్మ ఊరు అయిన చింతలూరు వచ్చి ఉత్తర ముఖ వేంకటేశ్వరస్వామివారిని, నూకాలమ్మ అమ్మవారి ఆలయాలను దర్శించుకున్నారు. భక్తుల సహకారంతో అమ్మవారి ఆలయం దినదినాభివృద్ధి చెందడం శుభపరిణామం అని అన్నారు.
Similar News
News November 7, 2025
నూతనకల్: యాక్సిడెంట్‌లో ఒకరు మృతి

గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలైన ఘటన నూతనకల్ మండల పరిధిలోని ఎర్రపహాడ్ ఎక్స్ రోడ్ జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి జరిగింది. పెదనేమిల గ్రామానికి చెందిన కాసోజు మురళి, జంగం లాజర్ పోలుమల్ల నుంచి బైక్‌పై పెదనేమిల వెళ్తుండగా జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. మురళీ, లాజర్ తీవ్ర గాయాలు కాగా హాస్పిటల్‌కు తరలించగా మురళి మృతి చెందాడు.
News November 7, 2025
డిసెంబర్ 30 నుంచి వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ

AP: తిరుమలలో DEC 30 నుంచి జనవరి 8 వరకు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నట్లు EO అనిల్ సింఘాల్ తెలిపారు. ఇందుకు సంబంధించి టోకెన్ల జారీ వివరాలను త్వరలో ప్రకటిస్తామన్నారు. ఈ నెల 17 నుంచి 25 వరకు కార్తీక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అంగప్రదక్షిణ టోకెన్ల జారీని డిప్ విధానం నుంచి మార్చామని, ముందు వచ్చిన వారికి ముందు ప్రాతిపదికన 2026 FEB నుంచి ఆన్‌లైన్ కోటా రిలీజ్ చేస్తామన్నారు.
News November 7, 2025
హనుమకొండ: ఐనవోలులో సినిమా షూటింగ్

ఐనవోలు మండలం రెడ్డిపాలెం, రాంనగర్, నందనం గ్రామాల్లో శివభ్రమేంద్ర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ‘సిద్ధుగాడి లవ్ స్టోరీ’ సినిమా షూటింగ్ జోరుగా కొనసాగుతోంది. రమేశ్ బాబు దర్శకత్వంలో, సావిత్రమ్మ నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రంలో మనోజ్ హీరోగా, శృతి, మౌనికలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా రాంనగర్‌లో నటుడు సుమన్‌పై కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఆయనను చూడటానికి స్థానికులు తరలివచ్చారు.


