News August 27, 2025

ఆలయాల అభివృద్ధికి కృషి: మంత్రి ఆనం

image

రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల అభివృద్ధే ప్రభుత్వం లక్ష్యం అని మంత్రి ఆనం నారాయణరెడ్డి అన్నారు. కాణిపాకం ఆలయంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. ‘కాణిపాకంలో రూ.4 కోట్లతో నూతన అన్నదాన భవనాన్ని ప్రారంభించాం. ఆగమన పద్ధతి ప్రకారం ఆలయాల్లో పూజలు నిర్వహించాలని ఆదేశించాం. సీఎం చంద్రబాబు ఆలయాల అభివృద్ధే లక్ష్యంగా కృషి చేస్తున్నారు’ అని ఆయన అన్నారు.

Similar News

News August 27, 2025

పుంగనూరులో యాక్సిడెంట్..మహిళ మృతి

image

పుంగనూరులో బుధవారం జరిగిన బైక్ యాక్సిడెంట్‌లో ఓ మహిళ మృతి చెందింది. సింగరిగుంట గ్రామానికి చెందిన భార్య,భర్తలు బోయకొండ, సుజాత పుంగనూరు నుంచి సింగరిగుంటకు బైక్‌పై వెళ్తున్నారు. రెడ్డివారి బావి వద్ద వాహనంపై నుంచి సుజాత జారి రోడ్డుపై పడడంతో తలకు బలమైన గాయమైంది. క్షతగాత్రురాలను తిరుపతి రుయా ఆసుపత్రికి ఓ అంబులెన్స్‌లో తరలిస్తుండగా మార్గమధ్యంలోని రొంపిచర్ల వద్ద మృతి చెందింది.

News August 27, 2025

DSC అభ్యర్థులు ఫేక్ సర్టిఫికెట్లు సమర్పిస్తే కేసులే: DEO

image

DSC అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలలో ఫేక్ సర్టిఫికెట్లు ఇస్తే కేసులు నమోదు చేస్తామని డీఈవో వరలక్ష్మీ హెచ్చరించారు. సర్టిఫికెట్ల పరిశీలనకు నగరంలో రెండు కేంద్రాలు ఏర్పాట్లు చేసినట్లు ఆమె తెలిపారు. ఒరిజినల్ సర్టిఫికెట్లు లేకపోయినా, పరిశీలనకు గైర్హాజరైన ఉద్యోగం లేనట్లేనని తెలిపారు. క్రీడా కోటా కింద అభ్యర్థుల సర్టిఫికెట్లను రాష్ట్ర విద్యాశాఖ అధికారుల సమక్షంలో పరిశీలిస్తామన్నారు.

News August 27, 2025

పలమనేరు సీఐపై SP వేటు

image

పలమనేరు అర్బన్ CI నరసింహరాజును VRకు బదిలీ చేస్తూ SP మణికంఠ చందోలు ఆదేశాలు జారీ చేశారు. పలు కేసుల్లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఆయన స్థానంలో పలమనేరు రూరల్ సీఐ మురళీ మోహన్‌ను నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.