News September 4, 2024

ఆలస్యంగా బయలుదేరనున్న గరీబ్‌రథ్, గోదావరి

image

సికింద్రాబాద్ నుంచి విశాఖకు రావాల్సిన గరీబ్‌రథ్ బుధవారం రాత్రి 8:30 కాకుండా 10:30కు, గోదావరి ఎక్స్‌ప్రెస్ నాంపల్లిలో సాయంత్రం 6:35కి బయలుదేరనున్నాయి. గోదావరి ఎక్స్ ప్రెస్‌ను పిడుగురాళ్ల, గుంటూరు, విజయవాడ మీదుగా మళ్లించనున్నారు. అలాగే మహబూబ్ నగర్-విశాఖ, ముంబై ఎల్‌టీటీ-విశాఖ రైళ్లను సైతం పిడుగురాళ్ల, గుంటూరు, విజయవాడ మీదుగా మళ్లించనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.

Similar News

News September 22, 2025

విశాఖ పోలీసులకు ప్రతిష్టాత్మకమైన స్కోచ్ అవార్డు

image

విశాఖ పోలీసులకు అరుదైన గౌరవం దక్కింది. రోడ్డు ప్రమాద బాధితులకు విశాఖ సీపీ ఏర్పాటు చేసిన తక్షణ సహాయ కేంద్రంకు స్కోచ్ అవార్డు లభించింది.ఈ అవార్డును సెప్టెంబర్ 20న విశాఖ పోలీసులకు ప్రధానం చేసినట్లు విశాఖ సిపి శంక బ్రత బాగ్చి ఆదివారం ప్రకటనలో విడుదల చేశారు. భారతదేశమైన మొట్టమొదటిసారిగా రోడ్డు ప్రమాద బాధితులకు సహాయం అందించడం పట్ల అవార్డు దక్కిందని పేర్కొన్నారు.

News September 22, 2025

విశాఖలో 2,476 ఆక్రమణలు తొలగింపు

image

ఆపరేషన్ లంగ్స్ 2.0లో భాగంగా ఆదివారం ఒక్కరోజే 717 ఆక్రమణలు తొలగించినట్లు చీఫ్ సిటీ ప్లానర్ ఏ.ప్రభాకరరావు తెలిపారు. నాలుగు రోజుల్లో మొత్తం 2,476 ఆక్రమణలు తొలగించినట్లు వెల్లడించారు. ప్రధానంగా తగరపువలస, మిథిలాపురి, కొమ్మాది, పెదగదిలి, ఆర్‌టీసీ కాంప్లెక్స్, జగదాంబ, దొండపర్తి, గాజువాక, వడ్లపూడి, నెహ్రూ చౌక్, ప్రహలాదపురం తదితర ప్రాంతాల్లో విస్తృత స్థాయిలో ఆక్రమణలు తొలగించినట్లు పేర్కొన్నారు.

News September 22, 2025

విశాఖ సీపీ కార్యాలయంలో రేపు పీజీఆర్‌ఎస్

image

విశాఖ సీపీ కార్యాలయంలో సోమవారం పీజిఆర్ఎస్ నిర్వహించనున్నట్లు సిపి శంఖబ్రత బాగ్చి తెలిపారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నగర ప్రజలు లాఅండ్ ఆర్డర్, ట్రాఫిక్,క్రైమ్ సంబంధిత సమస్యలపై నేరుగా తనకు ఫిర్యాదు అందించవచ్చని వెల్లడించారు. ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదుల స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. నగర ప్రజలు ఈ విషయాన్ని గమనించాలన్నారు.