News November 15, 2025
ఆలుమగల కలహం, ఆరికకూడు వంట

భార్యాభర్తల మధ్య తలెత్తే చిన్నపాటి గొడవలు, అరికల (కొర్రలు) అన్నం వండడానికి పట్టేంత తక్కువ సమయంలోనే సద్దుమణుగుతాయని ఈ సామెత చెబుతుంది. భార్యభర్తల మధ్య కలహాలు దీర్ఘకాలం ఉండవు. అవి తాత్కాలికమైనవి. త్వరగా సమసిపోతాయి. ఆ కలహాలు వారి మధ్య అనురాగాన్ని మరింత పెంచుతాయి. అలాగే కొర్రల అన్నం కూడా తక్కువ సమయంలోనే సిద్ధమై ఆరోగ్యానికి మేలు చేస్తుందని ఈ సామెత అర్థం.
Similar News
News November 15, 2025
258 పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

ఇంటెలిజెన్స్ బ్యూరో(IB)లో 258 అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్(ACIO)పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. B.E./B.Tech/M.Tech ఉత్తీర్ణులైనవారు అర్హులు. మొత్తం పోస్టుల్లో 90 కంప్యూటర్ సైన్స్, ఐటీ పోస్టులు, 168 ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ పోస్టులు ఉన్నాయి. గేట్ స్కోర్, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.mha.gov.in/
News November 15, 2025
మైలు, అంటు తగలని పవిత్ర వస్తువులు ఇవే..

☞ సహజ క్రిమి సంహారిణి అయిన ‘పసుపు’. ☞ లక్ష్మీ రూపంగా భావించే ‘కుంకుమ’. ☞ ప్రకృతి నుంచి నేరుగా లభించే ‘పూలు’. ☞ పవిత్ర ఆహారంగా దేవుడికి సమర్పించే ‘పండ్లు’. ☞ పూజా ద్రవ్యాలలో ముఖ్యమైన ‘తమలపాకు’. ☞ గోవు నుంచి లభించే శుభ్రమైన ‘పాలు, పెరుగు’. ☞ మధురమైన, సహజ ఔషధమైన ‘తేనె’. ☞ సమస్త దోషాలు తొలగించే ‘తులసి’. ☞ శిరస్సును చల్లబరిచే శుద్ధ పదార్థమైన ‘గంధం’. ☞ యజ్ఞాలలో వాడే పవిత్ర ద్రవ్యమైన ‘నెయ్యి’. SHARE IT
News November 15, 2025
ఎరువుల వినియోగం.. పాటించాల్సిన సూత్రాలు

☛ సరైన సమయం: ఎరువులను సరైన సమయంలో వినియోగిస్తే సత్ఫలితాలు ఉంటాయి. ☛ సరైన ఎరువు రకం: పంటకు సమయానికి అవసరమైన సరైన ఎరువును ఎన్నుకోవడం వల్ల వృథా, పెట్టుబడి ఖర్చులు తగ్గుతాయి. ☛ సరైన ప్రదేశం: ఎరువులను నిపుణుల సూచనల మేరకు మొక్కకు మరీ దగ్గరగా కాకుండా, దూరంగా కాకుండా.. వేరు వ్యవస్థకు అందుబాటులో ఉండేలా వేయాలి. ☛ సరైన మోతాదు: సిఫార్సు మేరకు సరైన మోతాదులో ఎరువులను వేయడం వల్ల అధిక దిగుబడులను సాధించవచ్చు.


