News March 27, 2025

ఆలూరు సాంబ శివారెడ్డికి వైఎస్ జగన్ కీలక బాధ్యతలు

image

శింగనమల నియోజకవర్గ వైసీపీ నాయకుడు ఆలూరు సాంబ శివారెడ్డికి వైసీపీ కీలక పదవి కట్టబెట్టింది. ఎన్ఆర్ఐ విభాగం కన్వీనర్‌గా నియమిస్తూ ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పదవి ఇచ్చిన అధినేతకు సాంబ శివారెడ్డి ధన్యవాదాలు తెలిపారు. తన మీద జగన్ ఉంచిన నమ్మకంతో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని వెల్లడించారు.

Similar News

News November 9, 2025

ఈనెల 11న సీఎం వర్చువల్ శంకుస్థాపనలు: కలెక్టర్

image

జిల్లాలో పలు ప్రాజెక్టులకు ఈ నెల 11న సీఎం చంద్రబాబు వర్చువల్‌గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఇందుకు తగిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ డా. ఏ. సిరి అధికారులను ఆదేశించారు. ఆదివారం ఆర్డీవోలు, ఏపీఐఐసీ, ఎయిర్‌పోర్ట్, టూరిజం అధికారులతో కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ముఖ్యమంత్రి లబ్ధిదారులు, స్టేక్‌హోల్డర్లతో నేరుగా మాట్లాడే అవకాశం ఉండేలా సక్రమ ఏర్పాట్లు చేయాలని సూచించారు.

News November 9, 2025

ఏపీ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా మారుతుంది: మంత్రి కొండపల్లి

image

విశాఖలో ఏపీ గ్లోబల్ ఎంఎస్ఎంఈ ఎగుమతుల అభివృద్ధి సదస్సును ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదివారం ప్రారంభించారు. ఈ సదస్సుకు 16 దేశాల నుంచి 44 మంది డెలిగేట్‌లు హాజరయ్యారు. ఏపీని మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని మంత్రి పేర్కొన్నారు. MSMEలకు ఇప్పటికే రూ.439 కోట్ల మేర ప్రోత్సాహకాలను ప్రభుత్వం విడుదల చేసిందన్నారు.

News November 9, 2025

బాల్య వివాహాల నిర్మూలన పై అవగాహన కార్యక్రమాలు: అదనపు కలెక్టర్

image

జిల్లాలో బాల్యవివాహాల నిర్మూలనపై రేపటి నుంచి ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు ప్రారంభించబోతున్నట్లు జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ తెలిపారు. ఐసీడీఎస్ అధికారులు బృందాలుగా ఏర్పడి, జిల్లాలోని వివిధ ప్రాంతాలలో బాల్య వివాహాల అనర్థాలు, నిర్మూలన అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.