News February 13, 2025
ఆలూర్‌లో కుంటలో పడి వ్యక్తి మృతి

ఆలూర్ వెంకటేశ్వర గుట్ట వద్ద తవ్విన కుంటలో ముత్తేన్న అనే వ్యక్తి మతిస్థిమితం సరిగా లేక మద్యానికి అలవాటు పడి కుంటలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బుధవారం ఉదయం ఆయన ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గురువారం ఉదయం ఏడు గంటలకు కుంటలో ఆయన మృతదేహం బయటపడింది.
Similar News
News November 3, 2025
NZB: ప్రైవేట్ ఆసుపత్రుల తనిఖీలపై DM&HO సమీక్ష

నిజామాబాద్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రైవేటు ఆసుపత్రిని తనిఖీ చేసే బృందాలు నిర్వహించే విధులపై DM&HO డాక్టర్ బి రాజశ్రీ సోమవారం సమీక్ష జరిపారు. ప్రైవేట్ ఆస్పత్రిలో తనిఖీ బృందాలుగా ఆసుపత్రిలో తనిఖీకి వెళ్ళినప్పుడు ఏమేమి చూడాలి, ఫామ్ ఎఫ్‌ను ఏ విధంగా ఆడిట్ చేయాలి, అక్కడ రిజిస్టర్లను ఏ విధంగా చెక్ చేయాలి, ఏ రకమైన పద్ధతులను అవలంబించాలి మొదలగు విషయాలపై వైద్యులకు అవగాహన కలిగించారు.
News November 2, 2025
NZB: 77 కిలోల వెండి చోరీ

నిజామాబాద్‌లోని వన్ టౌన్ పరిధిలో ఓ సిల్వర్ మర్చంట్ షాపులో 77 KGల వెండి చోరీ అయ్యింది. నగరానికి చెందిన ఇద్దరు సిల్వర్ మర్చంట్‌లో 6 నెలలుగా పని చేస్తున్నారు. వారు షాప్‌లో నుంచి వెండిని విడతల వారీగా చోరీ చేశారు. ఇటీవల వారిని షాప్ యజమాని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. దీంతో 4 KGల వెండిని తిరిగి ఇచ్చినట్లు సమాచారం. మిగతా 73 KGల వెండి తిరిగి ఇవ్వకపోవడంతో బాధితుడు వన్ టౌన్‌లో ఫిర్యాదు చేశాడు.
News November 2, 2025
నిజామాబాద్: ఈ నెల 15న స్పెషల్ లోక్ అదాలత్

ప్రజల విసృత ప్రయోజనాలకు పెద్ద పీట వేస్తూ ఈ నెల 15న కోర్టు ప్రాంగణాల్లో స్పెషల్ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవ అధికార సంస్థ ఛైర్‌పర్సన్ జీవీఎన్ భారత లక్ష్మీ తెలిపారు. జిల్లా కోర్టు ప్రాంగణంలోని ఆమె ఛాంబర్‌లో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, న్యాయసేవ సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్ భాస్కర్ రావుతో కలిసి విలేఖరులతో మాట్లాడారు.


