News October 28, 2025
ఆలేరులో అధిక వడ్డీ, బిట్ కాయిన్ల దందా

ఆలేరులో అధిక వడ్డీ వ్యాపారం జోరుగా నడుస్తోంది. కొందరు వడ్డీ వ్యాపారులు బాధితుల నుంచి ముందుగానే తెల్ల కాగితంపై సంతకాలు చేయించుకుని ఈ దందా నడిపిస్తున్నట్లు సమాచారం. అలాగే బిట్ కాయిన్ల దందా విచ్చలవిడిగా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. కోదాడ నియోజకవర్గంలోనూ బినాన్స్ వ్యవహారంపై గతంలో వార్తలొచ్చాయి. అధిక డబ్బుకు ఆశపడి జీవితాలు ఆగం చేసుకోవద్దని పోలీసులు సూచిస్తున్నారు.
Similar News
News October 28, 2025
ములుగు జిల్లాకు భారీ వర్ష సూచన

ములుగు జిల్లాలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ తెలిపింది. ఉరుములు, మెరుపులతో పాటు, ఈదురుగాలు కూడా విస్తాయని పేర్కొంది. గంటకు 50-60 కి.మీ వేగంతో ఈదురుగాలులు, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కాగా, శిథిలావస్థ ఇళ్లు, లోతుట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు.
News October 28, 2025
తుఫాను ప్రభావం.. భీకర గాలులు

AP: మొంథా తుఫాను దృష్ట్యా పలు జిల్లాల్లో భీకర గాలులు వీస్తున్నాయి. కోనసీమ, విశాఖ, కాకినాడ జిల్లాల్లో చెట్లు విరిగిపడ్డాయి. తీరం దాటే సమయంలో గంటకు 90-110 KM వేగంతో గాలులు వీస్తాయని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం *మచిలీపట్నం- 93 km/h *కాకినాడ- 82 km/h *విశాఖ- 68 km/h *రాజమండ్రి ఎయిర్‌పోర్ట్- 65 km/h *గంగవరం పోర్ట్- 58 km/h *చింతపల్లి- 55 km/h *బద్వేల్ (కడప)- 52 km/h వేగంతో గాలులు వీస్తున్నాయి.
News October 28, 2025
పూజ గదిలో ఈ విగ్రహాలు ఉండకూడదు: పండితులు

పూజ గదిలో శనిదేవుడు, రాహువు, కేతువుల ఫొటోలు/విగ్రహాలు పెట్టకూడదని పండితులు సూచిస్తున్నారు. వీటిని ఉంచడం వల్ల ఇంట్లో అశాంతి, ప్రతికూల శక్తి పెరిగే అవకాశాలు ఉంటాయంటున్నారు. ‘ఉగ్ర రూపాలైన కాలభైరవ, మహంకాళి ఫొటోలను కూడా ఇంట్లో పెట్టడం శుభకరం కాదు. పూజ గదిలో తినకపోవడం, నిద్రించకపోవడం ఉత్తమం. తడి జుట్టుతో ఆ గదిలోకి వెళ్లడం మంచిది కాదు’ అంటున్నారు. ✍️ మరిన్ని ఆధ్యాత్మిక కథనాల కోసం <<-se_10013>>భక్తి<<>> కేటగిరీ.


