News March 1, 2025
ఆల్ ది బెస్ట్.. పరీక్షలు బాగా రాయండి: మంత్రి సత్యకుమార్

ఇంటర్మీడియట్ విద్యార్థులకు మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆల్ ది బెస్ట్ చెప్పారు. నేటి నుంచి పరీక్షలు ప్రారంభం కానుండగా ఎలాంటి ఒత్తిడికిలోను కాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సూచించారు. ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళలా మీ వెంట ఉంటాయని ట్వీట్ చేశారు. నిబద్ధత, క్రమశిక్షణ, అభ్యాసం ద్వారా ఈ పరీక్షలను విజయవంతంగా పూర్తి చేయాలని సూచించారు.
Similar News
News March 1, 2025
డుంబ్రిగూడలో రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

డుంబ్రిగూడ మండలం నారింజవలస సమీపంలో శుక్రవారం రోడ్డు <<15611939>>ప్రమాదం<<>> జరిగిన విషయం తెలిసిందే. విశాఖకు చెందిన రామ్మోహన్, సోమనాథ్ పాడేరు నుంచి అరకులోయ వైపు వస్తుండగా స్కూటీ డివైడర్‌ని ఢీకొట్టింది. ఈఘటనలో సోమనాథ్ మరణించగా రామ్మోహన్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు క్షతగాత్రుడిని అంబులెన్స్‌లో అరకు ఏరియా ఆస్పత్రికి తరలించారు.
News March 1, 2025
తణుకు : ‘చికెన్, గుడ్లు అమ్ముకోవచ్చు’

బర్డ్ ఫ్లూ నేపథ్యంలో ప.గో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి కీలక ప్రకటన చేశారు. జిల్లాలోని వేల్పూరు గ్రామంలోని కృష్ణా నందం కోళ్ల ఫారం నుంచి ఒక కిలోమీటర్ పరిధిలో, పెదతాడేపల్లిలోని రామలక్ష్మి కోళ్ల ఫారం నుంచి కి.మీ పరిధిలో మినహా జిల్లాలో గుడ్లు, చికెన్ అమ్మకాలకు ఆంక్షలు కలెక్టర్ తెలిపారు. ప్రజలు ఏ విధమైన అపోహలు లేకుండా ఉడికించిన గుడ్లు, కోడి మాంసం తినొచ్చని సూచించార.
News March 1, 2025
ఇవాళ టీవీ, ఓటీటీలోకి ‘సంక్రాంతికి వస్తున్నాం’

అనిల్ రావిపూడి-విక్టరీ వెంకటేశ్ కాంబోలో తెరకెక్కిన కామెడీ ఎంటర్‌టైనర్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఇవాళ టీవీ, ఓటీటీలోకి రానుంది. సా.6గంటలకు జీతెలుగు ఛానల్‌లో, జీ5 యాప్‌లో స్ట్రీమింగ్ కానుంది. సాధారణంగా కొత్త సినిమాలు ఓటీటీలోకి వచ్చిన కొద్దిరోజులకు టీవీలో ప్రసారం చేస్తారు. కానీ ఈ మూవీని ఒకేసారి TV, OTTలోకి వదులుతుండటం గమనార్హం. సంక్రాంతికి రిలీజైన ఈ చిత్రం రూ.300 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది.