News March 1, 2025

ఆల్‌ ది బెస్ట్.. పరీక్షలు బాగా రాయండి: మంత్రి సత్యకుమార్

image

ఇంటర్మీడియట్ విద్యార్థులకు మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆల్‌ ది బెస్ట్ చెప్పారు. నేటి నుంచి పరీక్షలు ప్రారంభం కానుండగా ఎలాంటి ఒత్తిడికిలోను కాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సూచించారు. ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళలా మీ వెంట ఉంటాయని ట్వీట్ చేశారు. నిబద్ధత, క్రమశిక్షణ, అభ్యాసం ద్వారా ఈ పరీక్షలను విజయవంతంగా పూర్తి చేయాలని సూచించారు.

Similar News

News March 1, 2025

టీచర్ MLC ఎన్నికల రిజల్ట్‌పై ఉత్కంఠ!

image

KMM, WGL, NLG టీచర్ MLC ఎన్నికల రిజల్ట్‌పై ఉత్కంఠ నెలకొంది. మొత్తం 19 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా, ఎవరికి వారు గెలుస్తామనే ధీమాతో ఉన్నారు. ప్రధానంగా PRTU నుంచి శ్రీపాల్ రెడ్డి, UTF నుంచి నర్సిరెడ్డి, స్వతంత్రంగా పూల రవీందర్, BJP సరోత్తం రెడ్డి, సుందర్‌రాజ్, హర్షవర్ధన్ రెడ్డిలు ఉండగా.. శ్రీపాల్‌రెడ్డి, నర్సిరెడ్డి, రవీందర్‌ల మధ్యే పోటీ ఉన్నట్లు తెలుస్తోంది. రిజల్ట్ కోసం మరో 2 రోజులు చూడాల్సిందే.

News March 1, 2025

ఇంటర్ విద్యార్థులకు ఆల్‌ ది బెస్ట్ చెప్పిన సీఎం, లోకేశ్

image

AP: నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభమైన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. పిల్లలందరూ ధైర్యంగా ఉండాలని, ఏకాగ్రతతో పరీక్షలు రాయాలని Xలో పోస్ట్ చేశారు. వేసవికాలం కావడంతో డీహైడ్రేట్ కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి లోకేశ్ సూచించారు. ప్రయత్నం సరిగ్గా చేస్తే తప్పకుండా విజయం లభిస్తుందని ట్వీట్ చేశారు.

News March 1, 2025

హైదరాబాద్‌లో రేపటి నుంచి నైట్‌ఔట్!

image

నైట్ ఔట్ కల్చర్ మన హైదరాబాదీలకు కొత్తేమీ కాదు. కానీ, రేపటి నుంచి నగరంలో కొత్త రూల్స్ ఉండబోతున్నాయి. రంజాన్ నెల సందర్భంగా వ్యాపారులకు రేవంత్ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. 24 గంటలూ దుకాణాలు ఓపెన్ చేసేందుకు ఇటీవల ఉత్తర్వులు జారీ అయ్యాయి. రేపటి నుంచి మార్చి 31 వరకు ఈ రూల్స్‌ అమల్లో ఉంటాయి. ఇక మిడ్‌నైట్ షాపింగ్‌కు మన చార్మినార్‌‌లోని వ్యాపారులు సిద్ధమవుతున్నారు.

error: Content is protected !!