News September 6, 2025
ఆళ్లగడ్డలో ఈ మాస్టర్ వేరే లెవల్ అంతే..!

ఆళ్లగడ్డలో తైక్వాండో, మార్షల్ ఆర్ట్స్‌లో మాస్టర్ ఎల్‌టీ చంద్రమౌళి పేరు తెలియని వారెవరూ ఉండరు. 20ఏళ్లుగా ఎందరో క్రీడాకారులకు మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ ఇచ్చి, వారిని ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన ఘనత ఈయనకు దక్కింది. తన సొంత స్థలంలోనే అకాడమీ స్థాపించి, ఉచితంగా శిక్షణ ఇస్తూ ఎందరినో తైక్వాండో క్రీడాకారులుగా తీర్చిదిద్దారు. నేడు టీచర్స్ డే సందర్భంగా ఆయన దగ్గర క్రీడాకారులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
Similar News
News September 6, 2025
కుమారుడికి ఉద్యోగం రాలేదని మనస్తాపంతో ఆత్మహత్య

కుమారుడికి టీచర్ ఉద్యోగం వస్తుందని ఆశలు పెట్టుకున్న తండ్రి ఆత్మహత్య చేసుకున్న ఘటన అత్తిలి మండలం బల్లిపాడులో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. కుమారుడికి DSCలో ఉద్యోగం రాకపోవడంతో గ్రామానికి చెందిన కాకర్ల ఆదినారాయణ (65) శుక్రవారం రాత్రి తణుకులోని ఓ ఆసుపత్రి భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
News September 6, 2025
సంగారెడ్డి: జీపీవో నియామక పత్రాలు అందజేత

సంగారెడ్డి జిల్లా నుంచి ఎంపికైన జీపీవోలకు శుక్రవారం హైదరబాద్‌లోని మాదాపూర్ హైటెక్స్‌లో నియామక పత్రాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందజేశారు. సంగారెడ్డి జిల్లా నుంచి రెవెన్యూ డివిజన్ల వారీగా అధికారులు బస్సులను ఏర్పాటు చేసి వారిని హైదారాబాద్ తీసుకువెళ్లారు. నియామక పత్రాలు అందుకున్న వారికి త్వరలో పోస్టింగ్ కొరకు కౌన్సెలింగ్ ఉండనుంది.
News September 6, 2025
వికారాబాద్ ఎస్పీ కీలక సూచనలు

గణేశ్ నిమజ్జనానికి పోలీసులు గైడ్‌లైన్స్ విడుదల చేశారు.
* సాధ్యమైనంతవరకు ఉదయమే శోభయాత్రను ప్రారంభించాలి.* అప్పుడు భక్తులు పాల్గొనే అవకాశం ఉంటుంది. * చీకటి పడక ముందే నిమజ్జనం వీలవుతుంది.* ఎక్కడపడితే అక్కడ నిమజ్జనం చేయరాదు. * నిర్దేశిత దేశాల్లో నిమజ్జనం చేయాలి. * డీజేలకు అనుమతి లేదు.*అనుకోని ఘటనలు ఎదురైతే డయల్ 100 కాల్ చేసి సమాచారం ఇవ్వాలి.