News March 6, 2025
ఆళ్లగడ్డలో ఉచితంగా ‘ఛావా’ చిత్రం ప్రదర్శన

ఛత్రపతి శివాజీ కొడుకు జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘ఛావా‘ చిత్రం ఆళ్లగడ్డలోని రామలక్ష్మి థియేటర్లో నేడు ఉచితంగా ప్రదర్శించనున్నారు. మధ్యాహ్నం నుంచి 3 షోలు ప్రదర్శిస్తున్నామని థియేటర్ ప్రొప్రైటర్ అట్లా దిలీప్ కుమార్ రెడ్డి తెలిపారు. హిందూ ధర్మ పరిరక్షణలో భాగంగా థియేటర్ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రతి ఒక్క హిందూ సోదరులు సినిమాను చూడాలని ఆయన పిలుపునిచ్చారు.
Similar News
News March 6, 2025
‘సూపర్ 6’కు కేటాయింపులు ఏవి?: అంబటి

AP: కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంతా మోసం అని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. సూపర్ సిక్స్ పథకాలకూ నిధులు లేవా? అని ఎద్దేవా చేశారు. జగన్ లేవనెత్తిన ప్రశ్నలపై ప్రభుత్వం ఇప్పటికీ సమాధానం చెప్పలేదని విమర్శించారు. అమరావతిని అద్భుతంగా తీర్చిదిద్దుతామని చెప్పిన నేతలు కేటాయింపులు ఎందుకు చేయలేదని నిలదీశారు. CMగా ఉన్న వ్యక్తి పక్కపార్టీ వారికి సాయం చేయొద్దని చెబుతారా? అని ప్రశ్నించారు.
News March 6, 2025
వచ్చే సంక్రాంతి మామూలుగా ఉండదుగా!

సంక్రాంతి వచ్చిందంటే చాలు టాలీవుడ్లో సినిమాల పండుగ మొదలవుతుంటుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఇప్పటి నుంచే పెద్ద సినిమాలు క్యూ కడుతున్నాయి. ఆ టైమ్‌కి NTR-NEEL, చిరంజీవి- అనిల్ రావిపూడి, నవీన్ పొలిశెట్టి ‘అనగనగా ఒకరాజు’, రవితేజ- కిశోర్, వెంకటేశ్ -సురేందర్ రెడ్డి కాంబోలో వచ్చే సినిమాలు రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ సారి మొత్తం మూడు సినిమాలు రిలీజవగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ అధిక వసూళ్లు రాబట్టింది.
News March 6, 2025
నిర్మల్: 2nd ఇయర్ పరీక్షకు 296 గైర్హాజరు

గురువారం నిర్మల్ జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన 2nd ఇయర్ పరీక్ష ప్రశాంతంగా ముగిసినట్లు ఇంటర్మిడియట్ విద్యాశాఖ అధికారి జాదవ్ పరశురాం తెలిపారు. 6,102 మంది విద్యార్థులకు గాను 5,806 మంది విద్యార్థులు హజరయ్యారని పేర్కొన్నారు. జనరల్ విభాగంలో 5,172, ఒకేషనల్ విభాగంలో 634 మంది విద్యార్థులు పరీక్షకు హజరుకాగా, 296 మంది గైర్హాజరైనట్లు వెల్లడించారు.