News July 19, 2024
ఆళ్లగడ్డలో జబర్దస్త్ నటుడు సద్దాం సందడి

ఆళ్లగడ్డలో ప్రముఖ హాస్య నటుడు జబర్దస్త్ సద్దాం శుక్రవారం సందడి చేశారు. పట్టణానికి విచ్చేసిన సద్దాంతో జనసేన నాయకుడు మాబు హుస్సేన్ భేటీ అయ్యారు. సద్దాం మాట్లాడుతూ.. తన సొంతగడ్డ ఆళ్లగడ్డలో జన సైనికులను కలవడం ఆనందంగా ఉందన్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు కోసం జబర్దస్త్ టీంతో కలిసి తన వంతు ప్రచారం చేశానన్నారు. నేడు ఆయన ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం సంతోషంగా ఉందన్నారు.
Similar News
News November 8, 2025
ఆదోని: ఈతకెళ్లి బాలుడి మృతి

ఆదోని పరిధిలోని బసాపురంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. గౌరమ్మ పండుగ సందర్భంగా పుట్టింటికి వచ్చిన బిచ్చల ఈరన్న కూతురు వరమ్మ కుమారుడు కాలువలో శవంగా తేలాడు. శుక్రవారం పండుగ సందర్భంగా కుటుంబ సభ్యులు సంబరాల్లో మునిగారు. ఐతే బాలుడు ఒంటరిగా ఈత ఆడుకుంటూ కాలువలో కొట్టుకుపోయాడు. శనివారం హనువాళ్లు గ్రామంలో మృతదేహం లభ్యమైంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
News November 8, 2025
పెద్దకడబూరులో హోరాహోరీగా పొట్టేళ్ల పందేలు

పెద్దకడబూరులో శ్రీ భక్త కనకదాసు జయంతిని పురస్కరించుకుని కురువ సంఘం ఆధ్వర్యంలో శనివారం పొట్టేళ్ల పందాలను టీడీపీ నేతలు రమాకాంతరెడ్డి, మల్లికార్జున ప్రారంభించారు. గ్రామీణ క్రీడలలో భాగమే పొట్టేళ్ల పందేలని గుర్తు చేశారు. ఇందులో గెలుపొందిన పొట్టేళ్లకు నగదు బహుమతులు అందజేస్తామన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నల్ల, నట్టు పొట్టేళ్లకు వేరు వేరుగా పోటీలు నిర్వహించారు.
News November 8, 2025
భార్యను హత్య చేసిన భర్తకు జీవిత ఖైదు

2018 నవంబర్ 18న భార్య లక్ష్మీ దేవిని గొంతు నులిమి చంపిన కేసులో కర్నూలు శివప్ప నగర్‌కు చెందిన ముద్దాయి శ్రీనివాసులుకు జీవిత ఖైదు, రూ.10 వేలు జరిమానా విధిస్తూ కర్నూలు మొదటి అదనపు జిల్లా సెషన్స్ జడ్జి శుక్రవారం తీర్పునిచ్చారు. ముద్దాయి 4వ పట్టణ పోలీస్ స్టేషన్‌లో రౌడీ షీటర్‌గా ఉన్నాడు. 2007లో లక్ష్మీదేవిని ప్రేమ వివాహం చేసుకున్న శ్రీనివాసులు అనుమానంతో హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు.


