News March 25, 2025

ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భర్త కిలో చికెన్‌కు రూ.10 వసూలు: YCP

image

MLA భూమా అఖిలప్రియ భర్తపై YCP సంచలన ఆరోపణ చేసింది. ‘టీడీపీ నాయకుల కక్కుర్తి పరాకాష్ఠకు చేరింది. పనులు.. కాంట్రాక్టులే కాకుండా వీధి వ్యాపారులు, చికెన్ కొట్లనూ వదలడం లేదు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భర్త చికెన్ వ్యాపారాలపై కన్నేసి కిలోకి రూ.10 వసూలు చేస్తున్నారు. తాము చెప్పిన ఫారం నుంచే చికెన్ కొనాలని హుకుం జారీ చేశారు. రూ.కోటి ఇవ్వాలని హోల్ సేల్ వ్యాపారిని బెదిరించారు. ఇదేం కక్కుర్తి’ అంటూ ట్వీట్ చేసింది.

Similar News

News November 5, 2025

రాజమండ్రి: ఇళ్లు లేని పేదలకు కేంద్రం తీపికబురు

image

గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లు లేని పేదలకు గృహ వసతి కల్పించేందుకు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ పథకం 2.0 కింద అర్హులను గుర్తించాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. ఈ విషయమై జిల్లా కలెక్టర్ మంగళవారం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జిల్లాలో నవంబర్ 30వ తేదీ లోగా అర్హులైన పేదల వివరాలు సేకరించాలని కలెక్టర్ హౌసింగ్ అధికారి ఎన్. బుజ్జిని ఆదేశించారు.

News November 5, 2025

ఎస్సీ విద్యార్థులకు గుడ్‌న్యూస్: రూ.3,500 స్కాలర్‌షిప్

image

జిల్లాలోని 9వ, 10వ తరగతి చదువుతున్న ఎస్సీ విద్యార్థులకు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ తరఫున వారికి రూ.3,500 స్కాలర్‌షిప్‌ను మంజూరు చేయనున్నట్లు ఆ శాఖ అధికారి భాగ్యలక్ష్మి ప్రకటించారు. ఈ మేరకు జిల్లా పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల ప్రిన్సిపాళ్లు తమ విద్యార్థుల వివరాలను https://telanganaepass.cgg.gov.in/ వెబ్‌సైట్‌లో తప్పక నమోదు చేయాలని ఆమె ఆదేశించారు.

News November 5, 2025

మరో 4 కొత్త రెవెన్యూ డివిజన్లు?

image

AP: నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే రెవెన్యూ డివిజన్లను సర్దుబాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. పీలేరు, అద్దంకి, గిద్దలూరు, మడకశిర కేంద్రాలుగా కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. మరోవైపు కైకలూరు సెగ్మెంట్‌ను కృష్ణా జిల్లాలో, గన్నవరం, నూజివీడులను ఎన్టీఆర్ జిల్లాలో కలపాలనే ప్రతిపాదనలను మంత్రివర్గ ఉపసంఘం పరిశీలిస్తోంది. ఇవాళ వీటిపై చర్చించి ప్రభుత్వానికి సిఫారసు చేయనుంది.