News December 27, 2025

ఆళ్లగడ్డ: నిద్రమత్తు ఐదుగురిని బలితీసుకుంది!

image

ఆళ్లగడ్డ మం. నల్లగట్ల వద్ద జరిగిన ప్రమాదానికి విశ్రాంతి లేని ప్రయాణమే కారణమని పోలీసుల దర్యాప్తులో తేలింది. HYDకు చెందిన క్యాటరింగ్ బృందం తిరుమల నుంచి <<18673522>>కారులో<<>> తిరుగు ప్రయాణమవగా, డ్రైవర్ శివసాయి నిద్రమత్తులో కునుకు తీయడంతో వాహనం డివైడర్‌ను దాటి బస్సును ఢీకొంది. ఘటనలో గుండెరావు, నరసింహ, శ్రవణ్, సిద్దప్ప, సిద్ధార్థ మరణించారు. టోల్‌ప్లాజా వద్ద పోలీసుల సూచన మేరకు ‘ఫేస్‌వాష్‌’ చేసుకున్నా ప్రమాదం తప్పేది.

Similar News

News February 20, 2026

అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన ఎమ్మెల్సీ అనంతబాబు..!

image

అసెంబ్లీ సమావేశాలకు హాజరైన వైసీపీ MLC అనంతబాబు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారనే ప్రచారం జరుగుతోంది. శుక్రవారం మండలి సమావేశాలకు హాజరైన ఆయన అకస్మాత్తుగా గన్‌మెన్లు, వ్యక్తిగత సిబ్బంది లేకుండా ఒంటరిగా వెళ్లిపోయారని సమాచారం. కాగా డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఇటీవల అనంతబాబు భార్య లక్ష్మీదుర్గను సిట్ ఏ2గా చేర్చిన సంగతి తెలిసిందే. ఆమె కూడా పరారీలో ఉండటంతో పోలీసులు గాలిస్తున్నారు.

News February 20, 2026

గద్వాల పోలీస్ విభాగానికి చేరిన ట్రెయిన్డ్ జాగిలం ‘ఆర్య’

image

ఎనిమిది నెలల బేసిక్ శిక్షణ పూర్తి చేసుకున్న పోలీస్ జాగిలం ‘ఆర్య’ను గద్వాల జిల్లాకు కేటాయించారు. ఐఐటీఏ మొయినాబాద్‌లో శిక్షణ పొందిన‘ఆర్య’ పేలుడు పదార్థాలను గుర్తించడంలో నైపుణ్యం సాధించిందని ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం డాగ్ హ్యాండ్లర్ భీమేష్, డాగ్ స్క్వాడ్ ఇన్‌‌ఛార్జ్ రవికుమార్, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు నరేష్, వెంకటేష్‌లు SP శ్రీనివాసరావును మర్యాదపూర్వకంగా కలిసి ‘ఆర్య’ను పరిచయం చేశారు.

News February 20, 2026

పల్వంచ: రైతులు లాభసాటి పంటల వైపు మళ్లాలి: మంత్రి తుమ్మల

image

రైతులు సంప్రదాయ పంటల నుంచి లాభసాటిగా ఉండే ఆయిల్ ఫామ్ సాగు వైపు మళ్లాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. శుక్రవారం పల్వంచకు వచ్చిన ఆయనకు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్వయంగా ఆయిల్ ఫామ్ మొక్కను నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, తదితరులు ఉన్నారు.