News March 26, 2025

ఆళ్లగడ్డ: సమాజ సేవకుడిని మరో పురస్కారం

image

ఎటువంటి స్వార్థం లేకుండా సంపాదించిన సొమ్ములో సగానికి పైగా సమాజానికి ఖర్చు చేస్తున్న నిస్వార్థ సేవకుడు డాక్టర్ బిజ్జల నగేశ్‌ను మరో పురస్కారం వరించింది. సమాజ సేవను గుర్తించి తాజాగా పశ్చిమ బెంగాల్‌కు చెందిన వెల్ రెడ్ ఫౌండేషన్ సంస్థ ఉత్తమ సామాజిక కార్యకర్తగా గుర్తిస్తూ మహాత్మా గాంధీ నేషనల్ ఫ్రైడ్ అవార్డును అందించింది. దీంతో పాటు ప్రశంస పత్రాన్ని పంపుతూ అభినందనలు తెలిపింది.

Similar News

News March 28, 2025

30 బంతుల్లో 31.. కోహ్లీపై ట్రోల్స్

image

చెన్నైతో మ్యాచులో విరాట్ కోహ్లీ ఇన్నింగ్సుపై సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి. విరాట్ ఓపెనింగ్ వచ్చి 30 బంతుల్లో 31 రన్స్ చేసి ఔటయ్యారు. టీ20లో టెస్ట్ ఇన్నింగ్స్ ఆడారని ఎద్దేవా చేస్తున్నారు. చాలా షాట్లు కనెక్ట్ చేయలేకపోయారని పోస్టులు చేస్తున్నారు. పిచ్ కఠినంగా ఉందని, అక్కడ వేగంగా ఆడటం కష్టమని కోహ్లీ ఫ్యాన్స్ రిప్లైలు ఇస్తున్నారు. మరి ఇవాళ్టి కోహ్లీ ఇన్నింగ్సుపై మీ కామెంట్?

News March 28, 2025

కర్నూలు జిల్లా TODAY TOP NEWS..!

image

➤ ‘కిలోకి రూ.10 కమీషన్’ నిరూపిస్తే ఆస్తులు రాసిస్తా: ఆళ్లగడ్డ ఎమ్మెల్యే
➤ ఉమ్మడి కర్నూలు జిల్లాలో నలుగురికి నామినేటెడ్ పదవులు
➤ సీ.బెళగల్ వీఆర్వోపై టీడీపీ నేత దాడి
➤ రూ.14 లక్షలు పలికిన ఒంగోలు గిత్త
➤ ఆదోని: పెట్రోల్ బంకులో చోరీ.. రూ.90 వేలు మాయం
➤ హొలగుంద మండలంలో గ్యాస్ లీక్.. ఇల్లు దగ్ధం
➤ మంత్రాలయం నేతలకు వైసీపీలో పదవులు
➤ కుట్రలకు పాల్పడినా మాదే విజయం: ఎస్వీ మోహన్ రెడ్డి

News March 28, 2025

కలెక్టర్: ‘పకడ్బందీగా ఎన్నికల నిర్వహణకు సలహాలు అందించాలి’

image

పకడ్బందీగా ఎన్నికల నిర్వహణకు సలహాలు, సూచనలు అందించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి ఓటర్ జాబితా సవరణపై జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. సమీకృత జిల్లా కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ కుమార్‌ఝ వీడియో సమావేశంలో పాల్గొన్నారు.

error: Content is protected !!