News March 3, 2025
ఆళ్లగడ్డ: సైబర్ నేరగాళ్ల వలలో ప్రైవేటు ఉద్యోగి

అధిక డబ్బులకు ఆశపడి సైబర్ నేరగాళ్ల వలలో చిక్కి రూ.72,000 పోగొట్టుకున్న ఘటన ఆళ్లగడ్డలో చోటుచేసుకుంది. రాజేశ్ నాయక్ అనే వ్యక్తి పట్టణంలో టాటా కంపెనీలో లోన్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. టెలిగ్రామ్‌లో సైబర్ నేరగాళ్లు అధిక డబ్బులు వస్తాయని ఆశ చూపి బురిడీ కొట్టించారు. మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఆదివారం పట్టణ ఎస్ఐ నగీన కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
Similar News
News March 3, 2025
శ్రీకాకుళం: ఇంటర్ పరీక్షలకు 337 మంది డుమ్మా

ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. శ్రీకాకుళం జిల్లాలో 74 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతుండగా.. సోమవారం జరిగిన తెలుగు/ సంస్కృతం పరీక్షకు 337 మంది గైర్హాజరైనట్లు జిల్లా ఆర్ఐఓ పీ.దుర్గారావు తెలిపారు. ద్వితీయ సంవత్సరం పరీక్షకు 18,782 మంది హాజరు కావాల్సి ఉండగా.. 18,445 మంది హాజరయ్యారని ఆయన తెలిపారు.
News March 3, 2025
రోహిత్‌పై ఇలాంటి వ్యాఖ్యలు సరికాదు: బీసీసీఐ

రోహిత్‌శర్మపై కాంగ్రెస్ నేత శమా మహమ్మద్ చేసిన వ్యాఖ్యలపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పందించారు. ఒక అంతర్జాతీయ టోర్నమెంట్ జరుగుతున్న వేళ బాధ్యతాయుతమైన వ్యక్తి ఇలా మాట్లాడటం సరికాదన్నారు. ఆటగాళ్లందరూ అద్భుతంగా ఆడుతున్నారని దాని ఫలితాలు కూడా చూస్తున్నామని తెలిపారు. వ్యక్తిగత ప్రచారం కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయటం మానుకోవాలని హితవు పలికారు.
News March 3, 2025
జగిత్యాల: పీస్ కమిటీ మెంబర్లతో డీఎస్పీ సమావేశం

జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు జగిత్యాల డీఎస్పీ రఘు చందర్, జగిత్యాల పట్టణ ఇన్స్పెక్టర్ ఎస్ వేణుగోపాల్‌లు సోమవారం జిల్లా కేంద్రంలోని ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో పీస్ కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. రంజాన్ పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముస్లిం మత పెద్దలను, పీస్ కమిటీ మెంబర్లను పిలిపించి మాట్లాడారు.