News September 12, 2025

ఆవిష్కరణలకు ప్రాధాన్యత ఇవ్వాలి: గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ

image

సైన్స్, టెక్నాలజీ రంగాలలో దేశం గ్లోబల్ లీడర్‌గా నిలవాలంటే పరిశోధన, నూతన ఆవిష్కరణలకు అనుకూలమైన వాతావరణం కల్పించాలని తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అన్నారు. హైదరాబాద్‌లోని CSIR–IICTలో జరిగిన ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్’ ఆరో ప్రాంతీయ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. పరిశోధనల ప్రోత్సాహం దేశ ప్రగతికి ఎంతగానో తోడ్పడుతుందని వివరించారు.

Similar News

News September 12, 2025

గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా డాక్టర్ వాణి

image

గాంధీ ఆసుపత్రి నూతన సూపరింటెండెంట్‌గా అడిషనల్ డీఎంఈ డాక్టర్ వాణిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆమె బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇప్పటి వరకు సూపరింటెండెంట్‌గా పనిచేసిన డాక్టర్ రాజకుమారిని ఫిజియాలజీ ప్రొఫెసర్‌గా బదిలీ చేశారు. ఆసుపత్రి సిబ్బంది నుంచి వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.

News September 12, 2025

HYD: వాట్సాప్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు

image

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఫిర్యాదుదారులకు ఎఫ్‌ఐఆర్‌ను వాట్సాప్‌లో పంపించే సరికొత్త విధానానికి సీపీ అవినాష్ మహంతి శ్రీకారం చుట్టారు. ఫిర్యాదు అందిన వెంటనే ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేసి బాధితుడికి వాట్సాప్‌లో పంపించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ చర్యతో పోలీసు సేవలు పారదర్శకంగా ఉండటంతో పాటు, ప్రజలకు పోలీసు వ్యవస్థపై నమ్మకం, విశ్వాసం పెరుగుతాయని పేర్కొన్నారు.

News September 12, 2025

HYD: వీధిలో చెత్త వేస్తున్నారా..? ALERT

image

HYD వీధులు, బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయడంతో తలెత్తే సమస్యలను నియంత్రించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. ప్రధానంగా రెండు రోడ్లు, ప్రార్థన స్థలాలు ఉన్నచోట్ల ఈ చర్యలు చేపడుతున్నారు. చెత్త వేస్తున్న వారిపై కేసు నమోదు చేయనున్నారు. ఇందుకోసం సీసీ కెమెరాలను వినియోగిస్తున్నారు. ఈ విధానం ప్రధానంగా వెస్ట్, సౌత్, సౌత్ వెస్ట్ జోన్లలో అమలు చేస్తున్నారు. దీంతో అవాంఛనీయ ఘటనలకు చెక్ పెట్టవచ్చని భావిస్తున్నారు.