News January 24, 2026
ఆవు తొలిచూలు, బర్రె మలిచూలు

ఆవు మొదటిసారి(తొలిచూలు) ఈనేటప్పుడు సాధారణంగా ఎక్కువ పాలు ఇవ్వకపోవచ్చు లేదా దూడ బలంగా ఉండకపోవచ్చు. అంటే, ఏదైనా ఒక పని తొలి ప్రయత్నంలో ఆశించినంత మంచి ఫలితాలు రాకపోవచ్చు. అదే బర్రె రెండోసారి(మలిచూలు) లేదా ఆ తర్వాత ఈనేటప్పుడు దూడ ఆరోగ్యంగా ఉండటంతో పాటు పాలు ఎక్కువగా ఇచ్చే అవకాశం ఉంటుంది. అంటే కొన్నిసార్లు తొలి ప్రయత్నం సరిగా లేకున్నా.. మలి ప్రయత్నం మెరుగైన ఫలితాలను ఇస్తుందని ఈ సామెత అర్థం.
Similar News
News February 22, 2026
కుండలు అమ్మే వ్యక్తికి ₹1.25 కోట్ల GST నోటీస్

రాయ్‌బరేలీ(UP)కి చెందిన సయీద్ అనే వ్యక్తి ₹2 విలువ చేసే చిన్న కుండలు అమ్ముతూ జీవిస్తున్నారు. ఆయనకు ఏకంగా ₹1.25 కోట్ల GST నోటీసు రావడం చూసి అవాక్కయ్యారు. ఆయన పేరిట 4 కంపెనీలు నడుస్తున్నట్లు వాటిలో ఉంది. గతంలో లోన్ కోసం ఆధార్, పాన్ కార్డులు ఇస్తే.. వాటిని ఎవరో కేటుగాళ్లు తప్పుడు వ్యాపారాలకు వాడినట్లు తెలుస్తోంది. కడు పేదరికంలో ఉన్న సయీద్.. తనకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్‌ను వేడుకున్నారు.
News February 22, 2026
జీడిమామిడిలో వచ్చిన కాయలు నిలబడాలంటే?

జీడిమామిడిలో పూత తర్వాత వచ్చిన కాయలు చిన్నగా ఉన్నప్పుడే రాలిపోతుంటాయి. చాలా తోటల్లో ఇది కనిపిస్తుంది. ఈ సమస్య తగ్గి కొత్తగా వచ్చిన కాయలు నిలబడాలంటే 19-19-19 లేదా మల్టికే(13-0-45)ను లీటరు నీటికి 5 గ్రాముల చొప్పున కలిపి కాయలు తడిచేలా పిచికారీ చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. దీని వల్ల కాయలు మొక్కలపై నిలబడి, దిగుబడి పెరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
News February 22, 2026
పండుగ రోజుల్లో ముహూర్తాలు ఎందుకు ఉండవు?

ముహూర్త శాస్త్రం ప్రకారం.. విదియ, తదియ, పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి, త్రయోదశి తిథులు శుభకార్యాలకు అనుకూలం. శ్రీరామనవమి, దుర్గాష్టమి, వినాయక చవితి పండుగ తిథులు అశుభ తిథుల కోవలోకి వస్తాయి. లోక కళ్యాణం కోసం దైవం ఆ రోజుల్లో అవతరించినా, సామాన్యుల వ్యక్తిగత కార్యాలకు (వివాహం, గృహప్రవేశం) ఆ తిథి బలం సరిపోదు. అందుకే పండుగ పవిత్రమైనా, శాస్త్రం నిర్దేశించిన తిథి శుద్ధి లేని కారణంగా ముహూర్తాలు నిర్ణయించరు.


