News June 25, 2024

ఆశిశ్ నెహ్రా ప్రశంసలందుకున్న ఆదిలాబాద్ బౌలర్

image

ఆదిలాబాద్‌కు చెందిన సాయిప్రసాద్ తన బౌలింగ్‌తో భారత మాజీ దిగ్గజ బౌలర్ ఆశిశ్ నెహ్రా ప్రశంసలందుకున్నాడు. SGF అండర్-19 రాష్ట్ర, జాతీయస్థాయి క్రికెట్ పోటీల్లో 2 సార్లు పాల్గొన్నాడు. కాగా ఇటీవల జరిగిన IPL టోర్నీలో మార్కరం, జాన్సన్, గిల్, సాయిసుదర్శన్, సాహా వంటి ఇంటర్‌నేషనల్ బ్యాటర్లకు నెట్స్‌లో బౌలింగ్ వేశారు. ఆఫ్ స్పిన్‌తో వారిని ఆకట్టుకున్న సాయిప్రసాద్‌ను ఆశిశ్ నెహ్ర అభినందించి పలు సూచనలు చేశారు.

Similar News

News June 29, 2024

ఉట్నూర్: అధికారులతో ఐటీడీఏ పీఓ సమావేశం

image

ప్రధానమంత్రి జన జాతీయ న్యాయ మహా అభియాన్ పథకాన్ని త్వరితగతిన పూర్తిచేయాలని ఐటీడీఏ పీఓ ఖుష్బూ గుప్తా ఆదేశించారు. శుక్రవారం కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. పథకం అర్హులైన లబ్ధిదారులకు ఆధార్, క్యాస్ట్ సర్టిఫికెట్, మొబైల్ నంబర్లను 15 రోజుల్లో కచ్చితంగా పూర్తిచేయాలని ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల మండల తహసిల్దార్లను ఆదేశించారు. ఐటీడీఏ కోర్ట్ కేసులపై ప్రత్యేకదృష్టి సారించాలన్నారు.

News June 28, 2024

ఆదిలాబాద్: జీవితంపై విరక్తి చెంది వ్యక్తి ఆత్మహత్య

image

మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన తానూర్ మండలం కోలూరులో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన దేవక్వాడ్ అశోక్ (31) మద్యానికి బానిసై జీవితంపై విరక్తి పెంచుకున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం తన పంట చేనులో ఓ చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

News June 28, 2024

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఎల్లో అలర్ట్

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇవాళ, రేపు బలమైన గాలులతో మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కాగా నిన్న కొమురం భీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో వర్షాలు కురిసినట్లు పేర్కొంది. వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.