News February 8, 2025

ఆశ్రమ పాటశాలల్లో పర్యటించిన అడిషనల్ కలెక్టర్

image

జైనూర్ మండలంలోని ప్రభుత్వ ఆశ్రమ ఉన్నత పాఠశాల బాలికల పట్నాపూర్‌లో ఆకస్మికంగా పర్యటించారు. పాఠశాలను సందర్శించిన అసిఫాబాద్ అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి.. పాఠశాలలో అన్ని రికార్డులను పరిశీలించారు. 10వ తరగతి విద్యార్థులకు మంచి మార్కులు సాదించేందుకు ఒక్క క్రమ పద్ధతిలో ప్రతీ ఒక్క సబ్జెక్టు తగు సమయం కేటాయించాలని సూచనలు చేశారు. 

Similar News

News September 14, 2025

నేడు రాష్ట్రంలో పిడుగులతో కూడిన వర్షాలు

image

AP: పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతం, ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా తీరాల్లో అల్పపీడనం, అనుబంధంగా ద్రోణి విస్తరించిందని APSDMA తెలిపింది. దాని ప్రభావంతో నేడు పిడుగులతో కూడిన వర్షాలు కురవొచ్చని చెప్పింది. శ్రీకాకుళం, కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షం, మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.

News September 14, 2025

KMR: అంతర్‌రాష్ట్ర దొంగ అరెస్టు

image

కారు నెంబర్ ప్లేట్ మార్చి దొంగతనాలకు పాల్పడిన ఒక అంతర్‌రాష్ట్ర దొంగను పోలీసులు అరెస్టు చేశారు. SP రాజేష్ చంద్ర వివరాలిలా..కామారెడ్డి వాసి శివారెడ్డి తాళం వేసిన ఇంటికి దొంగలు తాళాలు పగలగొట్టి బంగారు ఆభరణాలను చోరీ చేశారు. దీనిపై కేసు నమోదైంది. ఇవాళ రాజస్థాన్ వాసి హన్సరాజ్ మీనాకు అదుపులో తీసుకొని అతని వద్ద నుంచి 2 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించినట్లు SP వెల్లడించారు

News September 14, 2025

త్వరలో నిజామాబాద్ – ముంబై మధ్య వందే భారత్ రైలు: MP

image

త్వరలోనే నిజామాబాద్ – ముంబై మధ్య వందే భారత్ రైలు ప్రవేశపెట్టడానికి చర్యలు తీసుకుంటున్నట్లు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ తెలిపారు. శనివారం జరిగిన NZB చాంబర్ ఆఫ్ కామర్స్ నూతన కార్యవర్గం ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. వందే భారత్ రైలు మంజూరు కోసం చేసిన వినతి, రైల్వే మంత్రిత్వ శాఖ వద్ద పెండింగ్‌లో ఉందని తెలిపారు.