News November 29, 2025

ఆసక్తికరం.. నర్సింగరావు రాజకీయ జీవితం

image

గ్రామస్థాయి నుంచి రాజకీయ జీవితం ప్రారంభించి ఆ తరువాతి కాలంలో చట్టసభల్లో అడుగుపెట్టడం సర్వసాధారణం. కానీ సిరిసిల్ల మాజీ ఎమ్మెల్యే జువ్వాడి నర్సింగరావు జీవితం అందుకు పూర్తిగా భిన్నం. 1962, 1972లలో కాంగ్రెస్ తరఫున MLAగా గెలిచిన ఆయన ఆ తర్వాత 1977లో తంగళ్లపల్లి సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. 2015లో తుదిశ్వాస విడిచిన ఆయన ప్రజలకు సేవ చేయడానికి ఏ పదవి అయినా ఒకటేనని చెబుతుండేవారని ఆయన సన్నిహితులు ఇప్పటికీ అంటారు.

Similar News

News December 3, 2025

నల్గొండ: డీసీసీ ప్రెసిడెంట్‌గా నియామకపత్రం అందుకున్న పున్న కైలాశ్

image

నల్గొండ డీసీసీ ప్రెసిడెంట్‌గా పున్న కైలాశ్ నేత నియామకం ఇటీవల జరిగిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, రాష్ట్ర ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ చేతుల మీదుగా మంగళవారం నియామక పత్రాన్ని అందుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తన నియామకానికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు.

News December 3, 2025

గట్టమ్మ వద్ద రోడ్డు విస్తరణ పనులు పరిశీలించిన ఎస్పీ

image

మేడారం మహా జాతరకు వచ్చే భక్తులు ముందుగా జాకారం సమీపంలోని గట్టమ్మ ఆలయాన్ని సందర్శించుకుంటారని ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ అన్నారు. ఈ మేరకు గట్టమ్మ వద్ద ట్రాఫిక్ నియంత్రణకు సంబంధించి ఏర్పాట్లను పరిశీలించారు. వివిధ శాఖల అధికారులతో కలిసి సమన్వయం చేసుకుంటూ త్వరితగతిన రహదారి విస్తరణ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.

News December 3, 2025

ఖమ్మం: నేటి నుంచి మూడో విడత నామినేషన్ల పర్వం

image

స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మూడో విడత నామినేషన్ల స్వీకరణ నేటి(బుధవారం) నుంచి ప్రారంభం కానుంది. జిల్లాలోని ఏన్కూరు, కల్లూరు, పెనుబల్లి, సత్తుపల్లి, తల్లాడ, వేంసూరు, సింగరేణి సహా మొత్తం 7 మండలాల్లో అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేయవచ్చు. ఈ విడతలో మొత్తం 191 గ్రామ పంచాయతీలు, 1,742 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్లను ఈ నెల 5 వరకు స్వీకరిస్తారని అధికారులు తెలిపారు.