News April 10, 2025
ఆసిఫాబాద్‌లో కొత్త తరహాలో పశువుల రవాణా

ఆసిఫాబాద్ జిల్లాలో కొత్త తరహాలో మూగజీవాలను కబేళాలకు తరలిస్తూ లక్షల వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. అక్రమంగా తరలిస్తున్న పశువుల వాహనాలను పోలీసులు పట్టుకుంటున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని వ్యాపారులు కొత్త తరహాలో ఎవరికి అనుమానం రాకుండా ఒక వాహనంలో 2 పశువులను తరలిస్తే ఎవరికి అనుమానం రాదనే ఆలోచనతో తరలిస్తున్నారు. సోమవారం కాగజ్‌నగర్లో 13వాహనాల్లో 26 పశువులను పట్టుకున్నారు.
Similar News
News September 16, 2025
నెల్లూరు: ధాన్యం కొనుగోలు కేంద్రాలు లేక రైతుల ఇబ్బందులు!

జిల్లాలో 5 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. కోతలు మొదలైపోయినా ధాన్యం కొనుగోలు కేంద్రాలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మద్దతు ధర పుట్టి రూ.20,187 ఉండగా మిల్లర్లు రూ.13–15 వేలకే కొనుగోలు చేస్తున్నారు. వర్షాలు పంటను దెబ్బతీయగా ధరలు పడిపోతాయనే ఆందోళన రైతుల్లో ఉంది. గతంలో పుట్టి రూ.24 వేలు ఉండగా, ఇప్పుడు దళారుల చేతిలో దోపిడీకి గురవుతున్నామని రైతులు వాపోతున్నారు.
News September 16, 2025
ప్రజారోగ్యాన్ని వ్యాపారం చేయొద్దు: విడదల రజిని

ప్రభుత్వ ఆసుపత్రుల ప్రైవేటీకరణపై మాజీ మంత్రి విడదల రజిని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం పేరుతో ప్రజారోగ్యాన్ని వ్యాపారం చేయొద్దని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌కు లేఖ రాశారు. ఈ విధానం పేదలపై ఆర్థిక భారం మోపుతుందని, నాణ్యమైన వైద్యం అందకుండా చేస్తుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణ పూర్తిగా ప్రభుత్వ బాధ్యత అని ఆమె స్పష్టం చేశారు.
News September 16, 2025
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి భారీగా నీటి విడుదల

వర్షాల కారణంగా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ గేట్లు ఎత్తి 5-6 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల చేసే అవకాశం ఉందని మంగళవారం రామగుండం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పి.రవీంద్ర చారీ తెలిపారు. కడెం, శ్రీరాం సాగర్ ప్రాజెక్టుల నుంచి వస్తున్న వరద నీరు పెరిగిన నేపథ్యంలో నదీ పరివాహక ప్రాంతాల్లో ప్రజలు, పశువులు, గొర్రెల కాపరులు, చేపల వేటగాళ్లు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.