News October 6, 2025
ఆసిఫాబాద్‌లో స్థానిక ఎన్నికల్లో వర్గ పోరు

కాంగ్రెస్ పార్టీ నుంచి స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు. ASFలో కాంగ్రెస్ వర్గ పోరు కొనసాగుతుండటంతో ఆశావహులకు ఎదురుదెబ్బ తగలక తప్పదని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. డీసీసీ అధ్యక్షుడు విశ్వ ప్రసాద్ ఒక వర్గమైతే.. నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ శ్యాంనాయక్ మరో వర్గం. ఎంపీపీ, ఎంపీటీసీ స్థానాలకు రెండు వర్గాల నాయకులు ఆశావహుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.
Similar News
News October 6, 2025
జూబ్లీహిల్స్ బైపోల్.. కాంగ్రెస్ టికెట్ దక్కేదెవరికి?

TG: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక టికెట్ కాంగ్రెస్ అధిష్ఠానం ఎవరికి ఇస్తుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఏఐసీసీకి పీసీసీ ముగ్గురి పేర్లను సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. ఆ లిస్టులో నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్, CN రెడ్డి పేర్లు ఉన్నట్లు సమాచారం. అయితే పార్టీ సీనియర్ నేత అంజన్ కుమార్ యాదవ్ కూడా టికెట్ ఆశిస్తున్నారు. మరి వీరిలో ఎవరు ఉపఎన్నిక బరిలో నిలుస్తారో చూడాలి.
News October 6, 2025
శివుణ్ని ఏ సమయంలో దర్శించుకోవాలి?

పరమేశ్వరుని ఆలయానికి సాయంత్రం వెళ్లడం మంచిదని పండితులు సూచిస్తున్నారు. ఆ సమయంలో శివ లింగాన్ని దర్శించుకుంటే శుభం కలుగుతుందని అంటున్నారు. రోజు పూర్తయ్యే సమయంలో ఆ లయకారుణ్ని దర్శించుకోవడం వల్ల రెట్టింపు ఫలితం ఉంటుందని చెబుతున్నారు. ఎలాంటి తొందరపాటు లేకుండా, ప్రశాంతంగా, నెమ్మదిగా భగవంతుణ్ని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆయన అనుగ్రహం లభిస్తుందని సూచిస్తున్నారు. <<-se>>#DharmaSandehalu<<>>
News October 6, 2025
సంగారెడ్డి: 7న ఉమ్మడి జిల్లా ఫుట్ బాల్ పోటీలు

స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి మెదక్ జిల్లా ఫుట్ బాల్ పోటీలు 7వ తేదీన సంగారెడ్డిలోని అంబేడ్కర్ మైదానంలో నిర్వహిస్తున్నట్లు కార్యదర్శి శ్రీనివాసరావు ఆదివారం తెలిపారు. బాల,బాలికల అండర్-14, 17 పోటీలు జరుగుతాయని చెప్పారు. ప్రతిభ చూపిన వారిని రాష్ట్ర స్థాయికి ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 99481 03605 నంబర్‌కు సంప్రదించాలని కోరారు.