News July 8, 2024
ఆసిఫాబాద్: అంతర్జాతీయ స్థాయి అథ్లెటిక్స్‌లో సత్తా చాటిన దంపతులు

ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన దంపతులు ఇంటర్నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్-2024లో సత్తా చాటారు. జూన్ 5 నుంచి 7 వరకు ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో జరిగిన 5KM వాకింగ్ ఇంటర్నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో శకుంతల(48) రెండో స్థానం, ఆమె భర్త ఆనంద్ రావు(56) ఐదో స్థానం సాధించారు. దీంతో వారిని జిల్లా పోలీస్ కార్యాలయంలో అదనపు ఎస్పీ అడ్మిన్ ప్రభాకర్ రావు సన్మానించి అభినందించారు.
Similar News
News February 20, 2026
చైల్డ్ పోర్నోగ్రఫీ.. ఆదిలాబాద్ జిల్లాలో 5 కేసులు: ఎస్పీ

చైల్డ్ పోర్న్ వీడియోలు చూడటం, డౌన్‌లోడ్ చేయటం, సోషల్ మీడియాలో షేర్ చేయటం చట్టరీత్యా తీవ్రమైన నేరమని ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చరించారు. ఇటువంటి చర్యలకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లాలో ఇప్పటికే 5 కేసులు నమోదు అయ్యాయన్నారు. హైదరాబాద్ “చైల్డ్ టిప్ లైన్” పర్యవేక్షణ కొనసాగుతోందని పేర్కొన్నారు.
News February 20, 2026
ఆదిలాబాద్: ఈనెల 24న జాబ్ మేళా

ఆదిలాబాద జిల్లాలోని నిరుద్యోగ యువతి, యువకులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించేందుకు ఆదిలాబాద్ ప్రభుత్వ ITI కళాశాలలో ఈనెల 24న మంగళవారం జాబ్ మెళా నిర్వహిస్తున్నట్లు ఉపాధి కల్పన అధికారి మిల్కా తెలిపారు. ఏదైనా డిగ్రీ చేసి 18 నుంచి 35 లోపు వారు అర్హులన్నారు. ఎంపికైన వారికి ఆకర్షనీయమైన జీతంతో పాటు ఇతర అలవెన్సులు ఇవ్వనున్నట్లు తెలిపారు.
News February 20, 2026
ఆదిలాబాద్: పది పరీక్షలకు 52 పరీక్ష కేంద్రాలు

ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఏడాది 10,888 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నట్లు డీఈఓ రాజేశ్వర్ వెల్లడించారు. వీరిలో 5,443 మంది బాలురు, 5,445 మంది బాలికలు ఉన్నారు. మొత్తం 52 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని, పర్యవేక్షణ కోసం 52 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 52 మంది డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్లు, 13 మంది కస్టోడియన్లను నియమించినట్లు ఆయన పేర్కొన్నారు.


