News September 8, 2025

ఆసిఫాబాద్: ఈవీఎంలకు పటిష్ట భద్రత

image

ఈవీఎంల భద్రతకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి వెంకటేష్ దోత్రే తెలిపారు. త్రైమాసిక తనిఖీలలో భాగంగా సోమవారం ఆసిఫాబాద్‌లోని ఈవీఎం గోదామును గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఆయన పరిశీలించారు. గోదాము సీలు తెరిచి యంత్రాల భద్రతను నిర్ధారించుకున్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు భద్రతా చర్యలపై సంతృప్తి వ్యక్తం చేశారు.

Similar News

News September 9, 2025

NRPT: ‘లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి’

image

కక్షిదారులు కోర్టుల చుట్టూ తిరిగి సమయం వృథా చేసుకోకుండా, లోక్ అదాలత్‌లో కేసులను పరిష్కరించుకోవాలని ఎస్పీ యోగేష్ గౌతమ్ సూచించారు. ఈ నెల 13న నారాయణపేట, కోస్గి కోర్టుల్లో లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. పరిష్కరించదగిన కేసులను రాజీ మార్గం ద్వారా పరిష్కరించుకోవాలని, ఆసక్తి ఉన్నవారు స్థానిక పోలీసులను సంప్రదించాలని ఆయన పేర్కొన్నారు.

News September 9, 2025

పిట్లం: లింక్ ఓపెన్ చేయగా రూ.10,800 కట్

image

సైబర్ నేరగాళ్లు కొత్త పద్ధతులతో ప్రజలను నిత్యం మోసగిస్తూనే ఉన్నారు. పోలీసులు ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా, సైబర్ నేరాలు ఆగడం లేదు. తాజాగా, పిట్లంకు చెందిన మహేష్ అనే యువకుడు ఇలాంటి మోసానికి గురయ్యాడు. మహేష్ వాట్సాప్‌కు వచ్చిన ఒక లింక్‌ను ఓపెన్ చేశాడు. ఆ లింక్ తెరవగానే అతడి బ్యాంకు ఖాతా నుంచి ఒక్కసారిగా రూ. 10,800 కట్ అయ్యాయి. దీంతో తాను మోసపోయానని గ్రహించి PS లో ఫిర్యాదు చేశాడు.

News September 9, 2025

బీజేపీ స్టేట్ కమిటీపై ‘బండి’ గుస్సా

image

నూతనంగా ఏర్పాటైన BJP స్టేట్ కమిటీపై కేంద్రమంత్రి బండి సంజయ్ ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. KNR పార్లమెంట్ పరిధిలో బండి ప్రతిపాదించిన పేర్లను విస్మరించడం ఆగ్రహానికి కారణమని సమాచారం. 2 MLC సీట్లతో పాటు 2 సార్లు MPగా గెలిపించిన KNRకు ప్రాతినిథ్యం లేకపోవడం పట్ల BJP శ్రేణులు ఆందోళనలో ఉన్నాయి. ఇప్పటికే సికింద్రాబాద్ బేస్డ్‌గా స్టేట్ కమిటీ ఏర్పడిందని ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.